Asianet News TeluguAsianet News Telugu

'ఆచార్య' కు చిరుకు షాకిచ్చే రెమ్యునరేషన్

ఇక చిరంజీవి సీనియర్ అయ్యాడు కదా రెమ్యునేషన్ పెద్దేమీ ఉంటుందిలే అనుకునే వారికి అసలు నిజాలు తెలిస్తే షాకే. ఆయనతో సినిమాలు చేయటానికి వరస పెట్టి ప్రొడ్యూసర్స్ క్యూలు కడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తన తాజా చిత్రం ఆచార్యకు రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. 

Megastar charging 50 Crore for Acharya jsp
Author
Hyderabad, First Published Nov 17, 2020, 2:58 PM IST


వయస్సు పెరుగుతున్నా చిరంజీవి క్రేజ్ లో ఏ మాత్రం తగ్గుదల లేదు. గ్యాప్ ఇచ్చి ఎంట్రి ఇచ్చినా ఆయన గ్రేస్ తగ్గలేదు. కలెక్షన్స్ ఊపు తగ్గలేదు. తన తోటి సీనియర్ హీరోల కన్నా ఉన్నతమైన స్దానంలో ఉన్నారు. అందుకు ఆయన కఠోర శ్రమ, కథలు ఎంచుకునే తీరు,పట్టుదల కారణాలగా చెప్తారు. ఇక చిరంజీవి సీనియర్ అయ్యాడు కదా రెమ్యునేషన్ పెద్దేమీ ఉంటుందిలే అనుకునే వారికి అసలు నిజాలు తెలిస్తే షాకే. ఆయనతో సినిమాలు చేయటానికి వరస పెట్టి ప్రొడ్యూసర్స్ క్యూలు కడుతున్నారు. 

ఈ నేపధ్యంలో ఆయన తన తాజా చిత్రం ఆచార్యకు రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. కాగా వెదాళాం కోసం ఇంకాస్త పెంచి రూ.60 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.వెదళాం కోసం ఇంకాస్త పెంచి రూ.60 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ రెమ్యునేషన్ విషయంలో నిర్మాత అనిల్ సుంకర మాత్రం వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.  ఈ మూవీని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు

ఇక కొద్దిగా వెనక్కి వెళితే...చిరంజీవి కూడా తను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్లు.. అయితే ప్రాణం ఖరీదు ముందు విడుదలైంది. ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవికి ఎలాంటి పారితోషికం ఇవ్వలేదు. కానీ చిరు నటించిన మూడో చిత్రం మనవూరి పాండవులు సినిమాకు మాత్రం ఈయన అప్పట్లో 1,116 రూపాయాల పారితోషికం అందుకున్నాడు. ఆ సినిమాకు వెయ్యి నూట పదహార్లు అందుకోగానే చిరంజీవి ఆనందానికి అవధుల్లేవని చెప్తారు.తన తొలి సంపాదనను అమ్మానాన్న చేతుల్లో పెట్టి వాళ్ల ఆశ్శీసులు అందుకున్నారు మెగాస్టార్. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు 60 కోట్ల రెమ్యునేషన్ స్దాయికి వచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios