ప్రతి సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది సహజమే. అయితే మొదటి సినిమా వరకే ఎంతటివారికైనా బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. హంగామా డోస్ ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ఆచి తూచి అడుగేస్తున్నాడు. ఆయన దారిలో వచ్చిన అందరూ ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకొని ముందుకు సాగుతున్నారు. 

రీసెంట్ గా మరో మేనల్లుడి సినిమా కూడా మొదలైంది. సుకుమార్ ప్రొడక్షన్ లో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మెగా హీరోలు పెద్దగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకోకపోయినా పరవాలేదు గాని అడ్డ దారిలో వెళ్లి ఇండస్ట్రీ హిట్ అందుకున్నా కూడా మెగాస్టార్ తట్టుకోలేరు. బోల్డ్ కంటెంట్ తో ఈ మధ్య యువ హీరోలు ఎక్కువగా రచ్చ చేస్తున్నారు. ఆ విధంగా వెళితే మెగాస్టార్ కి ఎంతో కొంత బ్యాడ్ ఇమేజ్ ఎఫెక్ట్ పడకుండా ఉండదు. 

ఈ మధ్య వైష్ణవ్ తేజ్ కి అలాగే వరుణ్ కి కొంచెం మసాలా కంటెంట్ కథలు రావడంతో మెగాస్టార్ ఒప్పుకోలేదట. దేనికైనా ఒక లిమిట్ ఉండవచ్చు.. కానీ మెగా బ్రాండ్ లో అలాంటి కథలు ఎంత బావున్నా కూడా చేయడం కుదరదని చిరంజీవి యువ హీరోల కెరీర్ ముందు ఓ పెద్ద గీతే గీశారట. 

గతంలో నిహారిక విషయంలో అలాగే సాయి ధరమ్ తేజ్ విషయంలో సీరియస్ అయినా మెగాస్టార్ ఇటీవల మెగా యువ హీరోల కథలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతున్నారట. రీసెంట్ గా వచ్చిన కథలపై గీత దాటుతున్నారేమో అనుకోని   మెగా యువ హీరోలందరిని పిలిచి క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏ కథ అయినా కూడా మెగాస్టార్ పర్మిషన్ లేకుండా పట్టాలెక్కడం లేదన్నమాట. అది మ్యాటర్!