మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆచార్య రిలీజ్ విషయంలో.. చిరంజీవి మరో అడుగుముందుకు వేశారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆచార్య రిలీజ్ విషయంలో.. చిరంజీవి మరో అడుగుముందుకు వేశారు.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కొరటాల డైరెక్షన్ లో నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్ (Ram Charan) జోడీగా పూజా హెగ్డే(Pooja Hegde) సందడి చేయబోతోంది. ఇక ఈమూవీ మూడు రిలీజ్ డేట్లు మార్చుకుని.. ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ మూవీగా తెరకెక్కిన ఆచార్య (Acharya)ను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారట. సైరా సినిమా ద్వారా చిరంజీవి ఆల్ రెడీ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇక ట్రిపుల్ ఆర్ (RRR) రీలీజ్ కాకముందే.. రామ్ చరణ్ ఇప్పటికే బాలీవుడ్ లో పాపులారిటీ పొందాడు.
ఇక ఆచార్యలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్(Ram Charan) కూడా నటిచడంతో.. బాలీవుడ్ లో ఈ ఆచార్యకు హోప్స్ కలిగించింది. దాంతో ఆచార్యను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందకలోను బాలీవుడ్ లో ట్రిపుల్ ఆర్(RRR) ను రిలీజ్ చేయబోయే పెన్ స్టూడియోస్ ద్వారానే.. ఆచార్య(Acharya) కూడా హిందీలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పెన్ స్టూడియోస్ ద్వారా చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) ఖిలాడి(Khiladi) సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేశారు పెన్ స్టూడియోస్ వారు. ఇక వారి ఖాతాలో త్వరలో రిలీజ్ కాబోతున్న గంగూభాయ్ కతియావాడి, షాహిద్ కపూర్ జెర్సీ, ట్రిపుల్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ లో ఆచార్య కూడా చేయబోతున్నట్టు సమాచారం.
