Acharya Pre Release: మెగాస్టార్ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు..? ఎక్కడా..? ముఖ్య అతిధి ఎవరు..?

ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈనెలలోనే ఆచార్య మెగా ట్రీట్ ఉండటంతో సినిమా రిలీజ్ కు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. ప్రీ రీలీజ్ డేట్, టైమ్, ప్లేస్.. ముఖ్య అతిధి ఎవరు అన్న విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి.

Megastar Acharya Pre Release Event Update

ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈనెలలోనే ఆచార్య మెగా ట్రీట్ ఉండటంతో సినిమా రిలీజ్ కు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. ప్రీ రీలీజ్ డేట్, టైమ్, ప్లేస్.. ముఖ్య అతిధి ఎవరు అన్న విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. 

ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూస్తామా అని అనుకుంటున్న అభిమానులకు ఈనెలలోనే ఆచార్యతో భారీ ట్రీట్ ఇస్తున్నారు చిరంజీవి. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్ విషయంలో పక్కాగా ప్రణాళిక రెడీ చేసుకున్నారు టీమ్. 

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో  తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవితో స్క్రీన్ శేర్ చేసుకున్న ఈ సినిమాను  నిరంజన్ రెడ్డి - చరణ్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక చిరంజీవి సరసన  హీరోయిన్ గా  కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. ఈ సినిమాలో అవినీతిపరుల ఆటకట్టించడం కోసం పోరాటం చేసే వీరులుగా చిరంజీవి - చరణ్ కనిపించనున్నారు. 

ఈ నెల 29న ఆచార్య సినిమా  భారీస్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు టీమ్.  ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ కు  సంబంధించిన విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 24న గ్రాండ్ గా  జరపనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని  యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. 

 ప్రీరిలీజ్ కు ఈ తేదీ  దాదాపు ఖరారైపోయిందనీ తెలుస్తోంది. దీనికి సంబంధించిన  అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.  చాలా కాలం తరువాత మణిశర్మ మెగాస్టార్ కు మ్యూజిక్ చేస్తున్నారు. ఆచార్య  నుంచి ఇప్పటి వరకు బయటికి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ యాక్ట్రస్ సంగీత, అనసూయ  ముఖ్య మైన  పోషించిన ఈ సినిమాలో మెగాస్టార్ తో కలిసి  రెజీనా స్పెషల్ సాంగ్ తో హైలైట్ అవ్వబోతోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios