మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. ఇక సినిమా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్ కూడా బిజీబిజీగా పాల్గొంటున్నారు.  అయితే సైరాతో పాటు అక్టోబర్ 2న బాలీవుడ్ లో వార్ సినిమా కూడా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై కూడా మంచి క్రేజ్ నెలకొంది. టైగర్ ష్రాఫ్ - హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో యాక్షన్ ప్రియుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మెగాస్టార్ ఇటీవల బాలీవుడ్ మీడియా ముందు 'సైరా వర్సెస్ వార్' పై స్పందించారు.

రెండు సినిమాలు డిఫరెంట్ జనర్స్ లో వస్తున్నాయి కాబట్టి ఆడియెన్స్ ఈ రెండు సినిమాలను చూస్తారని సరికొత్త ఫీల్ తో ఎంజాయ్ చేస్తారని తాను అనుకుంటున్నట్లు మెగాస్టార్ మాట్లాడారు. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవాలని వార్ సినిమాకు తనదైన శైలిలో పాజిటివ్ గా విషెస్ అందించారు. ఇక వార్ సినిమా తెలుగులో కూడా సైరాకు పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఫైనల్ గా మొదటిరోజు ఏ సినిమా అత్యధిక కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.