మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా రాంచరణ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. రాంచరణ్ నటించిన తొలి చిత్రం చిరుత. తండ్రి చాటు కొడుకుగానే చరణ్ సినీరంగ ప్రవేశం జరిగింది. పూరీజగన్నాధ్ దర్శత్వంలో రాంచరణ్ సినీరంగప్రవేశం జరిగింది. చిరుత చిత్రం విడుదలై సెప్టెంబర్ 28తో సరిగ్గా 12 ఏళ్ళు పూర్తవుతోంది. 

రాంచరణ్ ని మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేస్తూ పూరి చేసిన ప్రయత్నం ఫలించింది. చిరుత మంచి సాధించింది. డాన్సులు, ఫైట్స్ తో అదరగొట్టిన చరణ్ స్టార్ మెటీరియల్ అని అంతా భావించారు. కానీ చరణ్ మెగాస్టార్ వారసత్వాన్ని కొనసాగించగలడా అనే సందేహాలు తొలి చిత్రం తర్వాత అలాగే ఉన్నాయి. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రం అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎరుగని రికార్డులు క్రియేట్ చేసింది. చరణ్ పెర్ఫామెన్స్, నటనకు ప్రశంసలు దక్కాయి. మగధీర చిత్రంతో చరణ్ ఇమేజ్ మాస్ ఆడియన్స్ లో దూసుకుపోయింది. 

చిరంజీవి వారసత్వాన్ని కొనసాగించేందుకు చరణ్ కు మగధీర చిత్రం చక్కటి ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ చిత్రం నిరాశపరిచినప్పటికీ యూత్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.  వచ్చిన రచ్చ, ఎవడు, నాయక్ లాంటి చిత్రాలు రాంచరణ్ మాస్ ఇమేజ్ ని పెంచుకుంటూ పోయాయి. 

ధృవ చిత్రంతో విభిన్నమైన ప్రయత్నాలకు సైతం తాను సిద్ధం అని చరణ్ సంకేతాలు పంపాడు. ఇక గత ఏడాది విడుదలైన రంగస్థలం చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. నటన పరంగా కూడా అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం చరణ్ కు టాలీవుడ్ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ తో అగ్రనటుడిగా చెక్కు చెదరని మార్కెట్ ఉంది. 

మెగాస్టార్ వారసత్వాన్ని విజయవంతగా కొనసాగిస్తున్న రాంచరణ్ చిత్రపరిశ్రమలో 12ఏళ్ళని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా '12GloriousYearsOfRAMCHARAN' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.