డబ్బింగ్ మొదలు పెట్టిన వరుణ్ తేజ్, ఆపరేషన్ వాలెంటైన్ మూవీ పై మెగా ప్రిన్స్ అప్ డేట్.
ఈసారి ఎలాగైనరా హిట్టు కొట్టాల్సిందే అని పట్టుదలతో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.అందుకు తగ్గట్టు ప్లాన్ లు కూడా చేస్తున్నారు. ఈక్రమంలో వరుణ్ తేజ్ తాజా మూవీ ఆపరేషన్ వాలంటేన్ కు సబంధించి తాజా అప్ డేట్ ను అందించారు మెగా ప్రిన్స్.

ఈసారి ఎలాగైనరా హిట్టు కొట్టాల్సిందే అని పట్టుదలతో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.అందుకు తగ్గట్టు ప్లాన్ లు కూడా చేస్తున్నారు. ఈక్రమంలో వరుణ్ తేజ్ తాజా మూవీ ఆపరేషన్ వాలంటేన్ కు సబంధించి తాజా అప్ డేట్ ను అందించారు మెగా ప్రిన్స్.
వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఎలాగైనా హిట్లు కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. పైగా ఈ ఏడాది ఈ కుర్ర హీరో పెళ్లి కూడా ఉండటంతో.. హిట్టు కొట్టి తన భార్య కు గిప్ట్ గా ఇవ్వాలి అనుకుంటుననాడు. మెగా హీరోలలో అందరికింటే కాస్త భిన్నంగా ఆలోచించిన సినిమాలు చేస్తున్నాడు వరుణ్. అయితే గద్దల కొండ గణేష్ తరువాత ఆరేంజ్ ఆరేంజ్ హిట్లు లేదు మెగా హీరోకి. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ఎఫ్3, గని, గాండీవధారి అర్జున చిత్రాలు నిరాశ పరచడంతో ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’పై భారీ అశలు పెట్టుకున్నాడు.
యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు నిన్న మొదలయ్యాయి. మరోవైపు వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్‌గా మానుషి చిల్లర్ నటించింది.
ఇక మానుషీ చిల్లార్ ఈసినిమాలో ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. వచ్చే నెల ట్రైలర్ విడుదల చేయాలని మూవీ టీమ్ రెడీ అవుతుంది. ఇక ఈమూవీలో వరుణ్ తేజ్ డబ్బింగ్ ప్రస్తుతం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గనిసినిమా కోసం చాలా కష్టపడ్డాడు వరుణ్. విదేశాల్లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. కాని అంత కష్టపడ్డందుకు ఫలితం లేకుండా అయ్యింది. గని సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది.