ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెట్లు కామన్. చాలా మంది హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ సెంటిమెంట్లు ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందట. అదేంటో తెలుసా..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెట్లు కామన్. చాలా మంది హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు ఉంటాయి. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ సెంటిమెంట్లు ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందట. అదేంటో తెలుసా..?
టాలీవుడ్ లో ఫిల్మ్ సెలబ్రిటీస్ కు సెంటిమెంట్లు ఎక్కువ. అది ఎన్టీఆర్ టైమ్ నుంచి ఇప్పుటి కుర్ర హీరోల వరకూ కొనసాగుతూనే ఉంది. ఉదాహరణంకు మహేష్ బాబుకు సినిమాఓపెనింగ్ సెంటిమెంట్. ఆయన తన సినిమా ఓపెనింగ్ కి వెళ్ళరు.. వెళ్తే ఆ సినిమా ప్లాప్ అవుతుందని నమ్ముతాడు. అలానే చాలా మందికి కొన్ని థియేటర్స్ లో సినిమా చూడటం సెంటిమెంట్ గా ఉంటుంది. అలానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ సెంటిమెంట్ ఉందట.
చాలా మంది సెంటిమెంట్ అంటే.. ఎవరో ఎదురు రావడం.. లేదంటే.. ఎవరిముఖం అయినా చూస్తే మంచి జరుగుతుంది లాంటిది కాదు.. ఓ విచిత్రమైన సెంటిమెంట్ ఉందట. వరుణ్ తేజ్ కు.. తన సినిమాలో కచ్చితంగా ఏదైనా సరే సీన్ కాని రొమాంటిక్ సాంగ్ కాని.. లండన్ కి వెళ్లి షూట్ చేస్తే ఆ సినిమా మంచి హింట్ అవుతుంది అని ఆయనకి ఓ నమ్మకమట. అది ప్రాక్టికల్ గా నిరూపితం కూడా అయ్యిందట.
అంతే కాదు పాపం కొన్ని సినిమాలకు ఈ సెంటిమెంట్ మిస్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాడట వరుణ్ తేజ్ .ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయాన్ని స్వయానా స్వయాన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు బయట పెట్టాడు. అందరికి సీక్రేట్ విప్పి చెప్పేశాడు. అందరికి షాక్ ఇచ్చాడు.
ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. అయితే త్వరలో ఈ మూవీ షూటింగ్ లండన్ లో చేయబోతున్నారు. ఈ విషయంలో ఓ సందర్భంలో ప్రవీణ్ సత్తార్ స్పందిస్తూ... వరుణ్ తేజ్ కు ఓ సెంటిమెంట్ ఉంది తాను నటించిన సినిమాలలో ఏదైనా సరే కొన్ని సీన్స్ కాని హీరోయిన్ తో పాటలు కాని పక్కాగా లండన్ లో షూటింగ్ చేయాలి. విదేశాలలో షూటింగ్ చేస్తే ఆయన సినిమా హిట్ అవుద్ది అనేది ఆయన ఓ సెంటిమెంట్ .
అందుకే ఈ సినిమాలో విదేశాలలో షూటింగ్ జరిగే సీన్స్ రాసుకోకపోయినా సరే ..ఆయన ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలిసి ప్రత్యేకంగా కొన్ని సీన్స్ ని యాడ్ చేసి ఆయన కోసమే సినిమా లండన్ లో షూట్ చేయబోతున్నాం అంటూ చెప్పారు ప్రవీణ్. ఈ విషయం విని షాక్ అవుతున్నారు ఆడియన్స్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. అంతేకాదు వరుణ్ తేజ్ నటించిన ప్రతి సినిమాలో కచ్చితంగా హీరోయిన్ కారణంగా హీరో బాధపడాల్సిందే. అలా ఉంటేనే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు వరుణ్ తేజ్ నటించిన హిట్ అయిన సినిమాలో ప్రతి సినిమాలలో అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ వచ్చాడు వరుణ్ తేజ్.
