వరుణ్ తేజ్ క్రేజ్ మామూలుగా లేదు.. మెగా ప్రిన్స్ కు భారీ కటౌట్ ఎక్కడంటే..?
వరుణ్ తేజ్ ఆర్మీలుక్ లో ఉన్న ఈ భారీ పోస్టర్ మెగాఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్.
మెగా యంగ్ హీరోలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లకే భారీగా ప్యాన్ పాలోయింగ్ ఉంది.. వారికి మాత్రమే భారీ స్థాయిలో బర్త్ డేలు,రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి అన్నఅభిప్రాయం ఉంది. కాని మరో మెగా హీరోకి కూడా పాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. హిట్లులేకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం కటౌట్లలో మనోడి మనసు దోచుకున్నారు.బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి.. షాక్ ఇచ్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు భారీ కటౌట్ పెట్టడం ప్రస్తుతం వైరల్ అన్యూస్ అవుతోంది.
రీసెంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు వరుణ్ తేజ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని దాదాపు 5 ఏళ్లు సీక్రేట్ గా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్ళాడాడు. ఈమధ్య కొత్త జంట మెగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా. ఇక తాజాగా వరుణ్ తేజ్ బర్త్ డే ఘనంగా సెలబ్రేట్ చేశారు ఫ్యాన్స్. ఆయనకు దాదాపుగా 126 అడుగుల భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేలోని సూర్యాపేట పట్టణంలో వరుణ్ తేజ్ కుఈ కటౌట్ ను ఏర్పాట్ చేశారు.
వరుణ్ తేజ్ ఆర్మీలుక్ లో ఉన్న ఈ భారీ పోస్టర్ మెగాఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. ఈ కటౌట్ కూడా ఆసినిమాలోనిదే కావడం విశేషం. ఇక వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్నాడు వరుణ్ తేజ్. గద్దలకొండ గణేష్ సినిమా తరువాత మనోడికి సరైన హిట్ లేదు. రీసెంట్ గా ఎంతో కష్టపడి చేసిన గని సినిమా దారుణంగా పోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈసారి ఎలాగైన సాలిడ్ హిట్ కొట్టాలని ప్రయత్నంలో ఉన్నాడు వరుణ్.
ఇక శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో.. ఆపరేషన్ వాలెంటైన్ చేస్తున్న వరుణ్....మరోవైపు మట్కామూవీలో కూడా నటిస్తున్నాడు. ఈరెండు సినిమాల కోసం బాగా కష్టపడుతున్నాడు మెగా ప్రిన్స్.. ఒక్క సినిమా కరెక్ట్ హిట్ పడ్డా..కెరీర్ కు కాస్త ఊపు వస్తుందనిచూస్తున్నాడు. ఈరెండు సినిమాలపైన వరుణ్ బాగా ఆశలు పెట్టుకున్నాడు. అటు మెగా కోడలు లావణ్యత్రిపాటి కూడా తాజాగా ఓ వెబ్ సిరీస్ తో ఆడియనస్ ముందుకు రాబోతోంది. ఈవెబ్ సిరీస్ లో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కూడా నటిస్తున్నాడు.