Asianet News TeluguAsianet News Telugu

2 ఏళ్ళు.. 6 సినిమాలు ఫ్యాన్స్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుడ్ న్యూస్.. ఇక పూనకాలే..

మెగా అభిమానులకు వరుస గుడ్ న్యూస్ లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈక్రమంలో రామ్ చరణ్ నుంచి మరో గుడ్ న్యూస్ చరణ్ అభిమానుల ఉత్సాహాన్ని ఇస్తుంది. 
 

Mega Power Star Ram Charan Upcoming Movies
Author
First Published Jan 13, 2023, 1:22 PM IST


ఆచార్య ఫెయిల్యూర్ తో బాగా డల్ అయిన మెగా అభిమానులకు వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఈరోజు వార్తేరు వీరయ్య రిలీజ్ తో మంచి ఉత్సాహం మీద ఉన్నారు ఫ్యాన్స్.  మరో వైపు ఆర్ఆర్ఆర్ లో నాటునాటుసాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం.. అంతకు ముందు చరణ్ తండ్రి కాబోతున్నట్టు ప్రకటించడం.. ఇలా వరుసగా శుభవార్తలు మెగా ఫ్యామిలీతో పాటు..అభిమానులకు కూడా బూస్ట్ ఇస్తున్నాయి. ఈక్రమంలోనే ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా మరో వార్త స్వయంగా చెప్పాడురామ్ చరణ్. అదేమిటంటే..? 

ఆస్కార్ రేసులో  దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. నాటు నాటు సాంగుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో దేశం అంతా ఈ సినిమా టీమ్ ను ప్రశంసలతో ముంచెత్తింది. ఈ ఉత్సాహంతో ఆస్కార్ లక్ష్యంగా మూవీ టీమ్ ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ లో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ  స్టైలీష్ లుక్ లో మెరిసిపోతున్నారు. హాలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈక్రమంలో హాలీవుడ్ మీడియాతో మాట్లాడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. 

ఈ సందర్భంగా రాంచరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌ తో ముచ్చటించాడు. హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి కాల్ వస్తే సినిమా చేస్తారా? అంటూ మాల్కిన్ ప్రశ్నించగా..తప్పకుండా చేస్తాను అంటూ చరణ్ బదులిచ్చాడు. అంతే కాదు ప్రస్తుతం తాను  6 ప్రాజెక్టులకు సైన్ చేసానని.. వెల్లడించారు. ఈఏడాది అంటే 2023 లో 3 సినిమాలు.. వచ్చే ఏడాది  2024 లో 3.. సినిమాలకు సైన్ చేసినట్లు చరణ్ చెప్పుకొచ్చాడు.
ఆర్.ఆర్.ఆర్ తరువాత ఆచార్యతో ఫెయిల్యూర్ చూసిన రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోపాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమా  చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మరి వీటితో కలిపి 6 సినిమాలు అని చెప్పాడా.. లేక ఇంకా ఆరు సినిమాలు ఉన్నాయా...? ఇంతకీ ఆ సినిమాలు ఏంటబ్బా అని మెగా ప్యాన్స్ ఆలోచనలో పడ్డారు. వాటి డీటేయిల్స్ ఎప్పుడు బయకు వస్తాయా అని అంతా ఎదురు చూస్తున్నారు. 

ఇక కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఎప్పుడు ఇలాంటి హాలీవుడ్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ సందడి చేసేవారు. కాని ఇప్పుడు సౌత్ సినిమా.. అది కూడా టాలీవుడ్ సినిమా నుంచి మన వాళ్లు.. అక్కడ జెండా పాతారు.  ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కింది. ఈ వేడుకకు చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి తమ సతీమణులతో సహా హాజరయ్యారు. రాజమౌళి జంట ఇండియన్ ట్రెడిషినల్ డ్రెస్ లో మెరిపించారు కూడా. 

Follow Us:
Download App:
  • android
  • ios