Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు, మెగా ఫ్యాస్స్ లో ఆందోళన, అసలేం జరిగింది..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడ్డారు. ఆయన గేమ్ ఛేంజర్ షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది..?
 

Mega Power Star Ram Charan Injured Game Changer Movie Shooting JMS
Author
First Published Sep 25, 2023, 3:17 PM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్..  రామ్ చరణ్ గాయపడ్డారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఆయన గాయపడినట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన ముఖానికి గాయం అయినట్టు తెలుస్తోంది. సౌత్  స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్  గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయిన ముందే.. ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చరణ్ కు ప్రాథమిక చికిత్స అందించారని తెలుస్తోంది.  వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో, పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిసింది. 

ముఖానికి గాయం అవ్వడంతో షూటింగ్ కు  విరామం ప్రకటించక తప్పలేదు. దాంతో కొన్నిరోజులపాటు గేమ్ ఛేంజర్ షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా పడినట్టు సమాచారం. అయితే రామ్ చరణ్ గాయంపై ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.  అయితే శంకర్ ఇండియన్ 2 షూటింగ్ అయిపోవడంతో చరణ్ తో.. సెప్టెంబర్ లో యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ఆ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ అయి గేమ్ ఛేంజర్ సినిమా షూట్ మళ్ళీ వాయిదా పడింది. 

రామ్ చరణ్ సన్నిహితుల సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ కి చిన్న గాయం అయిందని, దానికి మేకప్ వేసి కవర్ చేయలేరని, అందులోనూ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని డాక్టర్ ప్రస్తుతం షూటింగ్ కాకుండా రెస్ట్ తీసుకోమని చెప్పినట్టు తెలుస్తుంది. కనీసం ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చరణ్ కి చెప్పినట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం జరగాల్సిన యాక్షన్ షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. 
 
అక్టోబర్ మొదటి వారంలో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి స్టంట్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాల ఎలాగైనా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.గాయం నుంచి కోలుకున్న వెంటనే రామ్ చరణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.అయితే రామ్ చరణ్ కు గాయాలు అయ్యాయిన తెలిసి మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంలో మెగా ప్యామిలీ నుంచి ఏదైనా విషయం తెలుస్తుందేమో అని ఎదరు చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios