విరాట్ కోహ్లీగా రామ్ చరణ్, స్టార్ క్రియెటర్ బయోపిక్ లో మెగా పవర్ స్టార్..
మళ్లీ బయోపిక్ ల కాలం స్టార్ట్ అయ్యింది. గతంలో వరుసగా బయోపిక్స్ రాగా.. ఈమధ్య వాటికి స్క్రీన్ పై గ్యాప్ వచ్చింది. ఇక ప్రస్తుతం మరోసారి బయోపిక్ మూవీస విజృంబించబోతున్నాయి. అంతే కాదు ఫస్ట్ టైమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బయోపిక్ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

మళ్లీ బయోపిక్ ల కాలం స్టార్ట్ అయ్యింది. గతంలో వరుసగా బయోపిక్స్ రాగా.. ఈమధ్య వాటికి స్క్రీన్ పై గ్యాప్ వచ్చింది. ఇక ప్రస్తుతం మరోసారి బయోపిక్ మూవీస విజృంబించబోతున్నాయి. అంతే కాదు ఫస్ట్ టైమ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బయోపిక్ మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో అయితే సీక్వెల్స్.. లేకుంటే రీమేక్ లు.. అదీ కాదంటే.. బయోపిక్ లు.. కొత్త కథలతో సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతీ ఇండస్ట్రీలో పరిస్థితి ఇప్పుడు ఇలానేఉంది. కాస్త ఫేమస్ అయ్యి.. రికార్డ్ లు సాధించిన సెలబ్రిటీలు ఉంటే చాలు సినిమా వాళ్లు బయోపిక్స్ అంటూ వచ్చేస్తున్నారు. మరీ ముఖ్యంగా క్రియెటర్ల జీవితాలను బయోపిక్ మూవీస్ గా తెరకెక్కించడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే ఎమ్ ఎస్ థోనీ.. సచిన్, కపిల్ దేవ్, మిథాలీరాజ్, సునిల్ గవాస్కర్ లాంటి క్రికెటర్ల బయోపిక్ లు సందడి చేయగా.. ఇప్పుడు శ్రీలంక స్టార్ క్రికెటర్ బయోపిక్ గా 800 రూపొందుతోంది. ఇవన్నీ పక్కన పెడితే.. మరో ఇండియన్ స్టార్ క్రికెటర్ లైఫ్ ను బయోపిక్ గా రూపొందించడం కోసం రంగం సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల ఎన్నిక విషయంలో అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్‌లు కూడా చరణ్ దర్శకుల వరుసలో వున్నారు. వీరి సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి. ఇదిలావుంటే.. రామ్‌చరణ్ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.
తాను త్వరలో స్టార్ క్రికెటర్ విరాట్‌కోహ్లీ బయోపిక్‌లో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాను ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. విరాట్‌కోహ్లి బయోపిక్ గురించి గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. చాలామంది హీరోలు కూడా ఈ విషయంపై తెరపైకొచ్చారు. చివరకు విరాట్‌గా రామ్‌చరణ్ కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా సంచలనంగా మారింది. విరాట్ కోహ్లి పుట్టినరోజైన నవంబర్ 5న ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదల కానుందని సమాచారం. దర్శకుడితోపాటు ఇతర వివరాలు కూడా అప్పుడే తెలుపనున్నారట.