మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన లైఫ్ లో ఫస్ట్ క్రష్ గురించి బయట పెట్టారు. స్వయంగా చరణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ ఈ విషయాన్ని చెప్పక తప్పలేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజీ స్టార్ మాత్రమే కాదు.. హాలీవుడ్ మీడియాను ఆకర్షించిన హీరో. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ కు అడుగు దూరంలో ఉన్నాడు రామ్ చరణ్. తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్ని మెగా హీరో.. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ లోను సందడిచేశారు. ఈక్రమంలోనే రామ్ చరణ్ ను వరుసగా హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలు చేస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.
ఇంటర్వ్యూలో భాగంగా.. రామ్ చరణ్ కు హీరోయిన్లలో క్రష్ ఎవరు అంటూ ప్రశ్న ఎదురయ్యింది...? దాంతో ఒకింత ఆశ్చర్యం.. ఒకింత ఇబ్బంది పడ్డ మెగా పవర్ స్టార్.. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయక తప్పలేదు. హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టం అంటున్నాడు రామ్ చరణ్. ఆన్ స్క్రీన్ లో జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్ అన్న చరణ్.. ఆమెను టీవీలో చూసినా, బిగ్ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను అన్నారు. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది అని వెల్లడించారు చరణ్.

అంతే కాదు బప్రెట్టీ ఉమెన్ సినిమా చూశాక, ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని చెపుతూనే.. తన మరో క్రష్.. గురించి కూడా బయటపెట్టాడు చరణ్. మరో హాలీవుడ్ నటి కేథరిన్ జెటా జోన్స్ అంటే కూడా తనకు చాలా ఇష్టమన్నారు. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది ది మార్క్ ఆఫ్ జోరో. ఆ మువీలో కేథరిన్ నటన నన్నెంతో ఆకట్టుకుంది అని అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుల్ ఇంటర్వ్యూ కావాలంటు కామెంట్లు కూడా పెడుతున్నారు ఫ్యాన్స్.
ఇక ప్రస్తుతం ఆస్కార్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న చరణ్..సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషనం లో తన15 వ సినిమా చేస్తున్నాడు. Rc15 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈమూవీ షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది. ఆల్ మోస్ట్ ఈమూవీ షూటింగ్ చివరిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో అంజలీ, శ్రీకాంత్, సునిల్ లాంటి మరికొందరు స్టార్లు సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్ట్స్ సినిమాను బుచ్చిబాబుతో చేయబోతున్నాడు.
