మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ 3 చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కి రాంచరణ్ ఆశ్చర్యపోయారు.

నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 చిత్రం మే 1న థియేటర్స్ లోకి వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ 3 నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 56 కోట్ల గ్రాస్ రాబట్టింది.

వయలెన్స్ తో కూడిన నాని యాక్షన్ అవతారాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా హిట్ 3 చిత్రానికి ఫిదా అవుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ హిట్ 3 చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాంచరణ్ ఇంకా హిట్ 3 చిత్రాన్ని చూసినట్లు లేదు. కానీ ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కి రాంచరణ్ కూడా ఆశ్చర్యపోయారు.

నానికి రాంచరణ్ కంగ్రాట్స్   

హిట్ 3 గురించి రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. హిట్ 3 గురించి అద్భుతమైన రివ్యూలు వింటున్నా. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ, వివిధ జానెర్స్ లో సినిమాలు చేస్తున్న మై డియర్ బ్రదర్ నానికి ప్రత్యేక అభినందనలు. ఇలాంటి కథని సిద్ధం చేసి దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలనుకు నా హ్యాట్సాఫ్. హీరోయిన్ శ్రీనిధి శెట్టి, నిర్మాత ప్రశాంతి లకు కంగ్రాట్స్ అని రాంచరణ్ పోస్ట్ చేశారు.

Scroll to load tweet…

నాగ చైతన్య రియాక్షన్ 

రాంచరణ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాంచరణ్ తో పాటు అక్కినేని నాగచైతన్య కూడా హిట్ 3 చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ తో పాటు అద్భుతమైన ఓపెనింగ్స్ సాధిస్తున్న నానికి, హిట్ 3 చిత్ర యూనిట్ కి బిగ్ కంగ్రాట్స్. హిట్ ప్రాంఛైజీ రోజు రోజుకు మరింత పెద్దగా మారుతోంది అని నాగచైతన్య ప్రశంసించారు.

Scroll to load tweet…

హిట్ 3 మూవీలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో నటించారు. నాని నటించిన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికే హైలెట్ అని రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా డైలాగులు కూడా బాగా పేలాయి.