మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అంబాని ఇంట జరగబోయే శుభకార్యంలో మెరవబోతున్నారు. ఇంటర్నేషనల్ స్టార్స్ పాల్గొనబోయే ఈవెంట్ లో మెగాపవర్ స్టార సతీ సమేతంగా సందడి చేయబోతున్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు అంబానీ ఇంట సందడి చేయబోతున్నారు. అంబాని కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కి వెళ్ళబోతున్నార. అనంత్ అంబానీ పెళ్లి.. రాధిక మర్చంట్ తో జరగబోతోంది. ఈ కపుల్స్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జమ్‌నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఫిబ్రవరి 28న వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ ఈవెంట్ కి వరుసగా ఇంటర్నేషనల్ ఫేమస్ పర్సనాలిటీస్ అంటెండ్ కాబోతోతున్నారు.
ఇప్పటికే వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్స్ ఇండియాలోలాండ్ అయ్యారు. ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ వైరల్ అవుతుంది. అయితే అంబాని ఇంట జరిగే ఈ గ్రేట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి ఇండియాలోని టాప్ స్టార్స్ కి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఈ సెలబ్రేషన్స్ కి గెస్ట్‌లుగా హాజరవుతున్నారు.
ఈక్రమంలోనే బాలీవుడ్ నుంచి ఇప్పటికే స్టార్స్ అంబాని ఈవెంట్ కు వరుస కట్టారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జమ్‌నగర్ చేరుకున్నారు. ఇక స్టార్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి కూడా సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిగే మెగా ప్యామిలీకి ఇన్విటేషన్ అందగా.. అందులో రామ్ చరణ్ జంటకి ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని, వారు ఇద్దరు కూడా ఆ సెలబ్రేషన్స్ కి వెళ్ళబోతున్నారని టాలీవుడ్ లో టాక్ గట్టిగా షికారు చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజమెంతో తెలియదు కాని.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగీత్ ఫంక్షన్ తో మొదలవుతున్న ఈ సెలబ్రేషన్స్ లో రిహన్న మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కాన్సర్ట్ కావాల్సిన భారీ మ్యూజిక్ పరికరాలు ఇండియాకి చేరుకున్నాయి. వరుసగా జరిగే ఈ ఈవెంట్స్ కు ఇంకెంతమంది సినిమా స్టార్స్ అటెండ్ అవుతున్నారో చూడాలి.
