Asianet News TeluguAsianet News Telugu

కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసం డైరెక్టర్ కాలేదు..ఎంఎస్‌ రాజు వ్యాఖ్యలు.. హీరోయిన్లపై కామెంట్‌

 దర్శకుడు ఎంఎస్‌ రాజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొడుకు సుమంత్‌ని హీరోగా నిలబెట్టడంకోసం దర్శకుడిగా కాలేదన్నారు.

mega maker m s raju bold comments on his son and his direction
Author
Hyderabad, First Published Jun 22, 2022, 11:09 PM IST

మెగా మేకర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్‌ రాజు.. దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవడం కోసం దర్శకుడిగా మారారు. ఇప్పటికే `డర్టీహరీ` సినిమాని రూపొందించిన ఆయన తాజాగా `7డేస్ 6నైట్స్` సినిమాని రూపొందించారు. తనయుడు హీరో సుమంత్‌ అశ్విన్‌, రజనీకాంత్‌ నిర్మించారు. సుమంత్‌ ఓ హీరోగా నటించారు, రోహన్‌, మెహర్‌ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. 

తాజాగా దర్శకుడు ఎంఎస్‌ రాజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొడుకు సుమంత్‌ని హీరోగా నిలబెట్టడంకోసం దర్శకుడిగా కాలేదన్నారు. తానేంటో నిరూపించుకునేందుకు, తాను గతంలో తీయలేని సినిమాలు తీయాలనే ఆశయంతో దర్శకుడిగా మారినట్టు తెలిపారు. సుమంత్‌ అశ్విన్‌ని హీరోగా నిలబెట్టాలనుకుంటే `డర్టీ హరీ`లోనూ అతన్ని పెట్టుకునే వాడినని తెలిపారు. `7డేస్ 6 నైట్స్` చిత్రంలో ఓ పాత్రకి తను సూట్‌ అవుతాడనిపించి తీసుకున్నట్టు తెలిపారు. 

కరోనా కాలంలో 'డర్టీ హరి' తర్వాత కొన్ని కథలు అనుకుంటున్నప్పుడు రాజ్ కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. ఆ క్యారెక్టర్లు నచ్చడంతో వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త కథ రాశానని తెలిపారు. ఇది యూత్‌ఫుల్ సినిమా కదా! డైలాగ్స్, సీన్స్ ఎలా రాయాలి? అనుకున్నప్పుడు ఇంట్లో చెప్పకుండా ఒక్కడే గోవా వెళ్లి ఈ కథ రాశాడట. `గోవాలో యువత తిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో గమనించాను. కొంత మందికి 'వీడు మనల్ని కిడ్నాప్ చేస్తాడా?' అనే ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా చాలా రీసెర్చ్ చేశా. బయోపిక్ కోసమే కాదు, ఇటువంటి యూత్ ఫిలిమ్స్ చేయాలనుకున్నప్పుడు కూడా రీసెర్చ్ అవసరమే` అని తెలిపారు.      

`రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ఎవరైనా అలసిపోయామని, ఇక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. నాలో రోజు రోజుకూ తపన పెరుగుతోంది.  నేను మధ్యలో వదిలేసిన గ్యాప్ ఉంది కదా! దాన్ని భర్తీ చేసుకునే సినిమాలు తీస్తున్నాను. ఇండస్ట్రీలో ఎవరూ అట్టెంప్ట్ చేయని జానర్ సినిమాలు అని కాదు, ఒక్కసారి సినిమా స్టార్ట్ అయితే అలా వెళ్లిపోయే సినిమాలు చేయాలనుకుంటున్నా. ఒక్కోసారి చిన్న ట్విస్ట్ సినిమాను తిప్పేస్తున్నాయి. అటువంటి సినిమాలు తీయాలనుంది. '7 డేస్ 6 నైట్స్' ఎలా ఉందో ప్రేక్షకులు చెప్పాలి` అని తెలిపారు. 

సినిమాలో కొత్త హీరోయిన్లని తీసుకోవడంపై రియాక్ట్ అవుతూ, `కొత్త హీరోయిన్లు అని అలుసుగా చూడలేదు. మహేష్ బాబు - భూమిక, ప్రభాస్ - త్రిష, సిద్ధార్థ్ - ఇలియానా నుంచి కొత్త హీరో హీరోయిన్ల వరకూ ఎవరికైనా నేను ఇచ్చే గౌరవం ఒక్కటే. పాత్రలకు తగ్గట్టు వాళ్ళిద్దరూ బాగా చేశార`న్నారు. `ఈ సినిమా థియేటర్లకు ముందు వచ్చేది యువతరమే. అందుకని, యూత్ సినిమా అంటున్నాను. అలాగే, ఇది ఫ్యామిలీ సినిమా కూడా! శుక్రవారం సాయంత్రానికి కుటుంబ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు వస్తారు. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు. సెన్సార్ దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది` అని చెప్పారు. 

నెక్ట్స్ `సతి` అనే సినిమా తీస్తున్నానని చెప్పారు. రాజమండ్రి  ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా 'సతి'. మిస్టరీ జానర్ లో ఉంటుందట. తాను నిర్మించిన ఓ బిగ్గెస్ట్ హిట్ మూవీకి సీక్వెల్‌ ప్లాన్‌ కూడా ఉందట. దాన్ని 14 భాషల్లో తీయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పారు. నేడు సినిమాని చూసేది యువతనే అని, వారికి నచ్చే సినిమాలే చేస్తానని తెలిపారు ఎంఎస్‌ రాజు. 

Follow Us:
Download App:
  • android
  • ios