ఈమధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. బ్రో మూవీ సక్సెస్ తో పాటు.. తన ఆరోగ్యం గురించి ఆయన ఆయాత్రలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడంటే..?
సుప్రీమ్ హీరో..మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా బ్రో . సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో.. తెరకెక్కిన ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోయద సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన నటుడు, దర్శకుడు సముద్రఖని తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. అయితే ఈసినిమాకు డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే మాత్రం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది. ఇక ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ కు పదును పెట్టారు. అటు హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్స్ లో తెగ సందడి చేస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా తిరుపతి వెళ్లిన తేజ్.. అక్కడ పరిసర ప్రాంతాల ప్రసిద్ధి దేవాలయాలని సందర్శించి పూజలు నిర్వహించాడు.ఇక తాజాగా ఆయన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నాడు. సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
అయితే సాయి ధరమ్ తేజ్ అక్కడికి వెళ్లడానికి కారణం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. సాయి దరమ్ తేజ్.. తన హెల్త్ గురించి స్వామిని వేడుకున్నట్లు, అలాగే అందరూ బావుండాలని కూడా కోరుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అరసవల్లిలో ఆరోగ్యం కోసం మొక్కులు ఎక్కువగా మొక్కుతుంటారు. సాయి తేజ్ కూడా తన ఆరోగ్యం కోసం ఈ దేవాలయాన్ని సందర్శిచినట్టు తెలుస్తోంది. 2014 లో సాయి తేజ్ అరసవల్లి దేవాలయానికి వచ్చినట్లు మళ్ళీ ఇన్నాళ్ల తరువాత వచ్చినట్లు పేర్కొన్నాడు.
అంతే కాదు బ్రో మూవీ గురించి మాట్లాడుతూ.. “నేను మా గురువు గారు కలసి సినిమా చేశాం. ఆడియన్స్ అంచనాలకు కచ్చితంగా రీచ్ అవుతాం. ప్యాన్స్ అనుకున్న దానికంటే బ్రో సినిమా ఎక్కువ బావుంటుంది” అని అన్నారు. ఇక సాయి తేజ్ గతంలో బైక్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి.. మళ్లీ సినిమాలు స్టార్ట్ చేశాడు. అంతే కాదు విరూపాక్ష సినిమాతో బ్లక్ బస్టర్ హిట్ కొట్టాడు సాయి తేజ్. ఇక ఈసారి బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకురాబోతున్నాడు. కాగా ఈసినిమా తరువాత సాయితేజ్ 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్నాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంత ట్రీట్మెంట్ బ్యాలెన్స్ ఉండటం.. చిన్న సర్జరీ కోసం ఆయన ఈ గ్యాప్ తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
