మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా.. రిలీజ్ కు రెడీగా ఉంది విరూపాక్ష సినిమా. రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్న ఈమూవీ.. తాజాగా సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది.   

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ డిఫరెంట్ కథలు ఎంచుకుని.. డిఫరెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఫేస్ చేసిన ఆయన.. తాజాగా సక్సెస్ లక్ష్యంతో చేసిన సినిమా విరూపాక్ష. ఆయన ఆశలన్నీ విరూపాక్ష సినిమాపైనే ఉన్నాయి. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన కార్తిక్‌ దండు డైరెక్టర్ గా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. రీసెంట్ గా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక వరుస ప్రమోషన ఈవెంట్స్ తో మూవీ టీమ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు సాయి తేజ్. 

ఇప్పటికే విరూపాక్ష సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్‌ చేశాయి. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రన్‌ టైమ్‌ 2 గంటల 25 నిమిషాలు అని ఫిక్స్ అయ్యింది. ఈసినిమాకు రన్ టైమ్ ప్లాస్అయ్యేలా ఉంది అంటున్నారు సినిమాపండితులు. 

ఇక ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాత ఉన్నారు. ఒక ఊరికి సబంధించిన వరుస చావులు.. వాటి వెనకాల ఉన్న కారణాలు.. మిస్టరీ చిక్కుముడిని ఎవరు విప్పారు అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది. సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కాంతారా ఫేమ్‌ అజనీష్‌ లోకనాథ్‌ మ్యూజిక్ అందించారు.