మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను ఒక ట్రాక్ లో కొనసాగిస్తున్న సాయి రీసెంట్ గా కలిసిన ఒక అభిమానికి మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు.

తనకు పుట్టిన పాపను సాయి ధరమ్ తేజ్ దగ్గరకు తీసుకు వచ్చిన ఆ అభిమాని పేరు పెట్టాల్సిందిగా కోరాడు.  దీంతో తన పేరు వచ్చేలా అభిమాని కోరిక మేరకు తేజన్విని అని నామకరణం చేశాడు. అనంతరం చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్న తనతో కొన్ని నిమిషాల పాటు సందడి చేశాడు. గత 9నెలలుగా తనపాపకు పేరు పెట్టకుండా మెగాహీరో సాయిధరమ్ తేజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పిన అభిమాని తన కూతురికి పేరు పెట్టటం సంతోషంగా ఉందని అన్నారు.

ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక సాయి తేజ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి రోజు పండగే అనే టైటిల్ తో రానున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఎండింగ్ దశలో ఉంది. రీసెంట్ గా విడుదలైన పోస్టర్స్ కి ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.