దేశవ్యాప్తంగా కొనసాగుతున్న దంగల్ ఫీవర్ మెగాస్టార్ మనువరాళ్లనూ వదలని దంగల్ ఇంట్లోనే కుస్తీపడుతున్న మెగాస్టార్ కుమార్తె సుష్మిత పిల్లలు
ఆమిర్ ఖాన్ మెగాస్టార్, పవర్ స్టార్ లపై అభిమానంతో మల్టీస్టారర్ చేయాల్సి వస్తే చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ తో చేస్తానన్నారు. ఆ అభిమానం తిరిగి చూపించాల్సిన బాధ్యత మరవకుండా పవన్ కూడా దేశం గర్వించ దగ్గ హీరో ఆమీర్ అంటూ పబ్లిగ్గా ట్విట్టర్ లోనే స్పందించి కమెంట్ చేశారు. ఇక పవర్ స్టార్ ను ఆదర్శంగీ తీసుకున్నారా.. అన్నట్లు మెగాస్టార్ మనమరాండ్లు కూడా ఆమిర్ మూవీ దంగల్ పై తమకున్న క్రేజ్ ఏంటో చూపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి మనవరాళ్లపై ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా ప్రభావం పడిందట. చిరు పెద్ద కూతురు సుస్మితా కొణిదెల ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా ఫోటోతోసహా ట్వీట్ చేసి మరీ తెలిపారు. ‘ఇంట్లో ‘దంగల్’ ఫీవర్. నా చిట్టి మల్లయోధులు. ఆమిర్ ఖాన్, ‘దంగల్’ చిత్ర బృందం కేవలం సినిమా మాత్రమే తీయలేదు.. ఓ స్ఫూర్తిని రగిలించారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాం’ అని సుస్మిత ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన ఇద్దరు కుమార్తెలు కలిసి కుస్తీ పడుతున్న చక్కటి ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ‘దంగల్’ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన ఆమిర్ దంగల్ మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకెళ్తోంది.
