రంగస్థలంపై ఎన్టీఆర్ చేసిన ట్వీట్లతో అభిమానుల్లో జోరుగా చర్చ

First Published 2, Apr 2018, 3:08 PM IST
mega fans and ntr fans discussing about ntr tweets on rangasthalam
Highlights
చర్చకు తెరలేపిన ఎన్టీఆర్ ట్వీట్లు..రంగస్థలంపై ట్వీట్స్

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ పై ఏక చత్రాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వీకెండ్ ముగిసే సమయానికి రంగస్థలం చిత్రం ట్రేడ్ విశ్లేషకులని సైతం షాక్ కి గురిచేసేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన రంగస్థలం పై ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. రాంచరణ్ నటనకు అంతా జేజేలు పడుతున్నారు. త్వరలో రాంచరణ్ తో కలసి నటించబోతున్న ఎన్టీఆర్ రంగస్థలం చిత్రంపై స్పందించాడు.

 

 

ఎన్టీఆర్ స్పందన అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఎన్టీఆర్, చరణ్ మధ్య చాలా కాలం నుంచి మంచి స్నేహం కొనసాగుతోంది. రంగస్థలం చిత్ర శుభాకాంక్షలు తెలియజేయడం ద్వారా ఈ విషయాన్ని ఎన్టీఆర్ మరో మారు బయట పెట్టాడు.

 

రంగస్థలం హవాతో టాలీవుడ్ లో పలు చిత్రాల గత రికార్డులన్నీ గతంగా మిగిలిపోతున్నాయి. ఖైదీ నెం 150 చిత్రం ఫుల్ రన్ లో సాధించిన యుఎస్ వసూళ్ళని రంగస్థలం చిత్ర కేవలం మూడు రోజుల్లోనే అధిగమించింది. రంగస్థలం చిత్రానికి ముందు రాంచరణ్ దృవ చిత్రంలో నటించాడు. ధృవ చిత్రంలో చరణ్ ఐపీఎస్ అధికారిగా అద్భుతమైన మేకోవర్ లో కనిపించి మెప్పించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ధృవ చిత్రం ఫుల్ రన్ లో 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ వసూళ్ళని రంగస్థలం కేవలం మూడు రోజుల్లోనే సాధించి ఆశ్చర్య పరిచింది.

 

రంగస్థలం విజయ గర్జన రీసౌండ్ తో బలంగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లుగా తనకు ఖైదీ చిత్రం తరహాలో రాంచరణ్ కు రంగస్థలం చిత్రం అవుతుంది అనే మాటలు అక్షరాలా నిజమయ్యాయి. రంగస్థలంలో రాంచరణ్ నటనకు జేజేలు పడుతున్నారు.

రంగస్థలం చిత్రంపై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు. ట్విట్టర్ వేదికగా... రాంచరణ్ కు హ్యాట్సాఫ్ అని తెలపడం అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. చరణ్, ఎన్టీఆర్ చాలాకాలం నుంచి మంచి స్నేహితులు. అభిమానుల్లో చర్చ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో మరో స్టార్ హీరోకి శుభాకాంక్షలు తెలియజేయడం, అభినందించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. రాంచరణ్ తరహాలో చిట్టి బాబు పాత్రనే మరెవరూ చేసి ఉండలేరని ఎన్టీఆర్ అభిప్రాయ పడ్డాడు. ఈ తరహా ప్రశంసలు ఎన్టీఆర్ చరణ్ గురించి చేయడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది.

 

 

టాలీవుడ్ కు ఇది శుభపరిణామం అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అందరి హీరోల మధ్య ఇదే తరహా స్నేహపూరిత వాతావరణం ఉండాలని, తద్వారా అభిమానులు కూడా మారుతారని చాలా మంది భావిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్షన్ ఎన్టీఆర్ దర్శకుడు సుకుమార్ పై కూడా ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి కథ తెరకెక్కించాలని ధైర్యం కావాలని, సుకుమార్ బ్రిలియంట్ డైరెక్షన్ తనని ఆశ్చర్య పరిచిందని ఎన్టీఆర్ తెలిపాడు. సమంత, దేవిశ్రీ ప్రసాద్ మరియు నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ పై కూడా ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు.

 

 

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత కూడా రాంచరణ్ ను కలసి రంగస్థలం విజయం సాధించడంతో ఓ గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

loader