మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరోయిన్ నిహారిక కొణిదెల వివాహం త్వరలో జరగనుంది. ఇటీవల గుంటూరు చెందిన పోలీస్‌ అధికారి తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. తాజాగా నిహారిక పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శ్రావణ సోమవారం సందర్భం, నాగబాబు ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెగా కుటుంబంలోని ఆడవాళ్లంతా పాల్గొన్నారు. వీళ్లతో పాటు నిహారిక స్నేహితురాళ్లు కూడా సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలను వీడియో రూపంతో తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది నిహారిక. అయితే పెళ్లి పనులు ప్రారంభమైన పెళ్లి డేట్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న వేడుక కావటంతో అభిమానుల్లోనూ సందడి వాతావరణం నెలకొంది.