మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగి వుంంది. ఇంకా చాలా మంది ఫ్యాన్ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఆమె మెగా కోడలిగానే కాకుండా ఇతర బిజినెస్ లలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నడుచుకునే తీరుతో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. 


ముఖ్యంగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులను ఉపాసన మొత్తంగా తన వైపు తిప్పుకుంది. ఎందుకంటే ఆ హీరోగారి గురించి ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా కూడా మెగా కోడలిని ఫాలో అవ్వాల్సిందే. ఇక అసలు విషయంలోకి వస్తే సాధారణంగా మనిషి ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఎవ్వరికైనా ఎదో ఒక నెగిటివ్ ఫీలింగ్ చాలా ఆందోళనకు గురి చేస్తుంది. రోజుకు పది పనులు చేసేవారిని ఆ ఆలోచనలు చాలా దెబ్బ తీస్తాయి. 


అయితే ఉపాసన ఆ విధంగా ఫీల్ అవ్వకుండా అన్ని పనులు ఒక లెవెల్లో సక్రమంగా జరగాలని రోజు పడుకునే ముందు ఒక పని చేస్తుందట. ఈ రోజు ఏం మిస్టేక్స్ చేశాం. అలాగే బాధిస్తున్న విషయాలు ఏమిటి? అనే విషయాలను క్లియర్ గా ఒక పేపర్ లో రాసుకొని ఆ తరువాత వాటిని రెండు మూడు సార్లు చదివి ఒక ఆలోచనకు వస్తుందట. అంతా క్లియర్ అనుకున్న తరువాత ఏదైనా అనవసరమైనవి ఉంటే ఆ ప్రశ్నలను మరొక పేపర్ లో రాసుకొని కాల్చేస్తుందట. ఆ విధంగా ఒకలా తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటుందట ఉపాసన.