మెగా 157 అప్డేట్... బింబిసార డైరెక్టర్ తో చిరంజీవి నెక్స్ట్!
మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో చిత్రాలు ప్రకటిస్తున్నారు. బింబిసార ఫేమ్ విశిష్ట్ దర్శకత్వంలో ఆయన మూవీ అధికారికంగా ప్రకటించారు.

ఏడాదిన్నర వ్యవధిలో చిరంజీవి 4 సినిమాలు విడుదల చేశారు. 2022 ఏప్రిల్ లో ఆచార్య విడుదల కాగా అక్టోబర్ లో గాడ్ ఫాదర్ విడుదలైంది. మరో మూడు నెలలకు సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్యతో వచ్చారు. ఇక 2023 ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల చేశారు. వీటిలో వాల్తేరు వీరయ్య మాత్రమే విజయం సాధించింది. ఆచార్య, భోళా శంకర్ డిజాస్టర్స్ కాగా గాడ్ ఫాదర్ యావరేజ్ రిజల్ట్ అందుకుంది.
భోళా శంకర్ పూర్తిగా నిరాశపరిచిన నేపథ్యంలో చిరంజీవి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇకపై రీమేక్స్ చేయవద్దంటూ ఆయనకు అభిమానులు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆచితూచి సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. బింబిసార మూవీతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ వశిష్ట్ కి అవకాశం ఇచ్చాడు. కొన్నాళ్లుగా చిరంజీవి-వశిష్ట్ కాంబినేషన్ లో మూవీ ఉందని ప్రచారం జరుగుతుంది. నేడు దీనిపై అధికారిగా ప్రకటన వచ్చింది.
యూవీ క్రియేషన్స్ నిర్మితుండగా చిరంజీవి 157వ చిత్రంగా తెరకెక్కుతుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుండగా త్వరలో మూవీ పట్టాలెక్కనుంది. కాగా చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో ఒక మూవీ చేయాలనున్నారు. ఇది మలయాళ చిత్రం బ్రో డాడీ రీమేక్ అని సమాచారం. దాదాపు ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు. భోళా శంకర్ ఫలితం నేపథ్యంలో ఈ చిత్రాన్ని చేస్తారా లేదా? అనే చర్చ నడుస్తుంది.