తమిళ నటి మీరా మిథున్ ఇటీవల చెన్నై కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తనని చంపేస్తామంటూ కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని మీరా తన ఫిర్యాదులో తెలిపారు. మీరాకు ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ ఎందుకు వస్తున్నాయో వివరాల్లో తెలుసుకుందాం.

మీరా కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. మీరా 2016లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది,. తనలాంటి సామాన్య మహిళా గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఎంతో కష్టపడాలి. తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని మోడలింగ్ లో రాణించా. ఆత్మవిశ్వాసంతో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నా. అందాల పోటీల్లో విజేతగా నిలవడం ఆషామాషి కాదు. అందుకే తన లాంటి సామాన్య యువతులు కూడా అందాల పోటీల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో మిస్ తమిళ దివా పేరుతో బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించబోతున్నట్లు మీరా తెలిపింది. 

గత ఆరునెలల నుంచి ఈ పోటీలు నిర్వహించేందుకు శ్రమిస్తున్నా. కానీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమిళనాడులో ఇలాంటి అందాల పోటీలు నిర్వహించవద్దని బెదిరిస్తూ ఫోన్ చేస్తున్నారు. వారి బెదిరింపులని నేను పట్టించుకోలేదు. కానీ గత నాలుగైదు రోజులుగా హత్య చేస్తామంటూ కొందరు ఫోన్ చేస్తున్నారు. అందుకే ఫిర్యాదు చేయడానికి కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు మీరా మిథున్ తెలిపింది. పోలీసులు తాను నిర్వహించే అందాల పోటీలకు భద్రత ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.