మీరా చోప్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం మీరా చోప్రా బాలీవుడ్ లో సఫేద్ అనే మూవీలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా చోప్రా తన పెళ్లి గురించి ఓపెన్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా వరుసగా వార్తల్లో నిలుస్తోంది. మీరా చోప్రా తరచుగా సోషల్ మీడియాలో ఇండియాలో హైలైట్ అవుతున్న పొలిటికల్ టాపిక్స్ పై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. 

మీరా చోప్రా ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలబడలేకపోయింది. అయితే తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇప్పటికి మీరా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. నాలుగు పదుల వయసు వచ్చినా మీరా చోప్రా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. 

అయితే ఎట్టకేలకు మీరా చోప్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం మీరా చోప్రా బాలీవుడ్ లో సఫేద్ అనే మూవీలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరా చోప్రా తన పెళ్లి గురించి ఓపెన్ అయింది. మీరా చోప్రా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి కజిన్ సిస్టర్ అనే సంగతి తెలిసిందే. 

తన పెళ్లి 2024 ఫిబ్రవరిలో జరగబోతున్నట్లు పేర్కొంది. తన కుటుంబ సభ్యులు ఆల్రెడీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారట. అయితే తన కి కాబోయే భర్త వివరాలు బయటపెట్టేందుకు మాత్రం ఇష్టపడలేదు. తన వివాహం రాజస్థాన్ లో జరగనుందట. దాదాపు 150 మంది గెస్ట్ లని ఇన్వైట్ చేయబోతున్నట్లు మీరా చోప్రా పేర్కొంది. 

రిసెప్షన్ మాత్రం ముంబైలో నిర్వహించబోతున్నట్లు మీరా చోప్రా పేర్కొంది. ఇటీవల మీరా చోప్రా ఓ మిస్టరీ వ్యక్తితో క్రిస్టమస్ ని సెలెబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోకి ప్యార్ వాలా క్రిస్టమస్ అని కూడా క్యాప్షన్ ఇచ్చింది. బహుశా అతడే మీరా చోప్రాకి కాబోయే భర్త అంటూ ప్రచారం జరుగుతోంది.