సారాంశం
`హిట్` బ్యూటీ మీనాక్షి చౌదరిని ఇప్పటి వరకు అందంగానే చూశారు. ఆమె గ్లామర్ సైడ్ మాత్రమే ఓపెన్ అయ్యింది. కానీ ఆమెలో మరో యాంగిల్ ఉంది. తాజాగా అది బయటపెట్టి షాకిచ్చింది.
`ఖిలాడీ` చిత్రంతో కుర్రాళ్లకి ఖిలాడీ భామ అయిపోయింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత `హిట్` మూవీతో కుర్రాళ్లని హంట్ చేసింది. అందులో తనదైన గ్లామర్ షోతో రచ్చ చేసింది. అడవి శేషుకి జోడీగా చేసి మెప్పించింది. ఈ సినిమా విజయంతో మీనాక్షి చౌదరి పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాలు చేస్తుంది.
తెలుగుతోపాటు తమిళంలోనూ చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. అయితే వెండితెరపై అందంతో ఆకట్టుకుంటుంది మీనాక్షి చౌదరి. మరోవైపు సోషల్ మీడియాలో తనదైన హాట్‌నెస్‌తో కుర్రాళ్లకి కనువిందు చేసింది. కానీ ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అవుతూ షాకిచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇందులో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించింది. ట్రైనర్ వద్ద కాలితో పంచ్‌లు ఇస్తూ రచ్చ చేసింది. అదిరిపోయే పంచ్‌లతో రఫ్ఫాడించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు అందంతో మెప్పించిన ఆమె ఇప్పుడు ఇలా యాక్షన్‌తో రచ్చ చేయబోతుందని చెప్పొచ్చు. దీనిపై ఆమె స్పందిస్తూ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రయత్నించడం ఇదే తనకు మొదటి సారి అని, తాను ఇప్పుడు పూర్తిగా ఇష్టపడుతున్నట్టు చెప్పింది.
దీని కారణంగా తన ఒత్తిడిని దూరం చేయడంలో నేను చేసిన సరదాకి ఇక్కడ చిన్న, రక్తపు తీపి రుజువుఉంది. అద్భుతమైన కోచ్,మెంటర్‌గా ఉన్నందుకు నసర్బిన్ అమ్మద్ కి ధన్యవాదాలు తెలిపింది మీనాక్షి. ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తూ హాట్ కామెంట్ చేస్తున్నారు. అందగా ఉందని ఓవర్ యాక్షన్ చేస్తే దబిడి దిబిడే అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం మీనాక్షి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం మీనాక్షి వరుణ్ తేజ్ `మట్కా` చిత్రంలో నటిస్తుంది. విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది. అలాగు `గుంటూరు కారం`లో సెకండ్ హీరోయిన్‌గా చేస్తుంది. `లక్కీ భాస్కర్` అనే మరో సినిమా చేస్తుంది. మరోవైపు తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. చివరగా అక్కడ `హత్య` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే.