యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మీనాక్షి చౌదరి తెలుగు డెబ్యూ మూవీ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రం ఆగష్టు 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీనాక్షి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుశాంత్ హీరోగా నటించాడు.
గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మీనాక్షి చౌదరి మొక్కలు నాటింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్బుతమని కొనియాడారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగస్వామ్యం అయి మొక్కలు నాటే అవకాశం కలిగినందుకు ఎంపీ సంతొష్ కుమార్ కి మీనాక్షి చౌదరి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి అక్షర హాసన్, విజయ్ ఆంటోని, సిద్ధార్థ శంకర్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం తర్వాత మీనాక్షి హిట్ , ఖిలాడీ చిత్రాల్లో నటిస్తోంది.