Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు కారం నుండి మరో మాస్ మసాలా సాంగ్... డోంట్ మిస్!

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. విడుదలకు సిద్ధం అవుతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో సాంగ్ విడుదల చేస్తున్నారు. తాజాగా 'మావా ఎంతైనా' లిరికల్ వీడియో వదిలారు. 
 

Mawaa enthaina lyrical song from mahesh babu guntur kaaram movie ksr
Author
First Published Jan 10, 2024, 10:47 AM IST

గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా ముగిసింది. గుంటూరు వేదికగా గ్రాండ్ గా నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానులు గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక విజయవంతం చేశారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించాలని భావించారు. అయితే అనుమతులు దొరకలేదు. దాంతో వేదిక ఏపీలోని గుంటూరుకి మార్చారు. మహేష్ బాబు సొంత ఊరిలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుక జరిగినట్లు అయ్యింది. 

మహేష్ బాబు తండ్రిగారైన కృష్ణ గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర గల బుర్రిపాలెం లో జన్మించిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా మహేష్ బాబు చేసిన ప్రసంగం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. మహేష్ తో పాటు గుంటూరు కారం యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా గుంటూరు కారం మూవీ నుండి మరో సాంగ్ విడుదల చేశారు. 

'మావా ఎంతైనా' అనే లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. మిర్చి యార్డులో మహేష్ బాబు మందు కొడుతూ మాస్ స్టెప్స్ తో ఇరగదీశాడు. ఈ సాంగ్ లో మహేష్ కి హారతి ఇస్తున్న మీనాక్షి చౌదరిని మనం చూడొచ్చు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, రామాచారి ఈ సాంగ్ ని ఆలపించారు. 

గుంటూరు కారం జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు వస్తున్న మొదటి చిత్రం గుంటూరు కారం. మహేష్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత మహేష్ నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వంటి సీనియర్ యాక్టర్స్ కీలక రోల్స్ చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios