దాదాపు 52 రోజులు పాటు ఒంటరిగా ఓ ఎడారిలో..కరెంట్ కూడా లేకుండా గడిపి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు హాలీవుడ్ స్టార్  మ్యాథ్యూ మెక్. ఈ ఆస్కార్ విజేత తన జీవితంలోని అనేక సంఘటనలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. మెక్ కనాగే తన జీవితంలో ఎదురైన మరిచిపోలేని ఘటనలకు అక్షర రూపం ఇవ్వటం ఆయన అబిమానులకు పండగలా మారింది. ‘గ్రీన్ లైట్స్’ పేరుతో  మార్కెట్లోకి వచ్చిన ఈ  పుస్తకాన్ని అక్టోబర్ 20వ తేదీన ఆవిష్కరించారు. అనంతరం మెక్ తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
‘గ్రీన్ లైట్స్’ విశేషాలు వివరిస్తూ..తన తండ్రి మరణం గురించి ఆయన ప్రస్తావించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటున్నది. ‘నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నాన్న మా అమ్మతో శృంగారం చేస్తున్నప్పడు గుండెపోటుతో చనిపోయారు. ఇది నాజీవితంలో అత్యంత విషాదకరం ఘటన. నా తల్లిదండ్రుల జీవితం ప్రత్యేకమైనది. అనేకసార్లు వాళ్లు విడిపోయారు. రెండు సార్లు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. మూడు సార్లు మళ్లీ ఒక్కటయ్యారు. వాళ్లిద్దరూ ఒకరినొకరు బాగా అర్దం చేసుకున్నారు అన్నారు. 

ఇక తన తల్లికు ఇప్పుడు 88, ఆమెకు ఓ తోడుని ఏర్పాటు చేయాలి. నా కో స్టార్ హ్యూజ్ గ్రాంట్ తండ్రి 91 ఏళ్లు. ఆయనకు భార్య చనిపోయింది. ఆయనితో, మా మదర్ కు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నా..వచ్చే వారం వాళ్లు కలుస్తారు. ఏమో నచ్చితే వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు అన్నారు.
 
 ఇక మ్యాథ్యూ మెక్ కనాగే హాలీవుడ్ లోని హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ది వెడ్డింగ్ ప్లానర్, హౌటూ లూస్ ఏ గయ్ ఇన్ 10 డేస్. ఫెయిల్యూర్ టు లాంచ్, ఫూల్స్ గోల్డ్ ,ఘోస్ట్ ఆఫ్ గర్లఫ్రెండ్స్ పాస్ట్ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ది లింకన్ లాయర్ ,బెర్నీ మ్యాజిక్ మైక్ ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కిల్లర్ జో చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా తీసుకొచ్చిన గ్రీన్లైట్స్ బుక్ కూడా విశేషంగా ఆకట్టకుంటున్నది.