నందమూరి నంటసింహం, సినీయర్ నటుడు బాలకృష్ణ నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ఎన్బీకే107 (NBK107). ఈ చిత్రం నుంచి తాజాగా మాసివ్ అప్డేట్ అందింది. ఫ్యాన్స్ పండుగ చేసుకోబోయే అనౌన్స్ చేశారు. 

`అఖండ` లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలయ్య హీరోగా వస్తోన్న చిత్రం ‘ఎన్బీకే107’. ఈ చిత్రాన్ని `క్రాక్‌` హిట్‌ తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ కాంబినేషనల్ వస్తున్న చిత్రం NBK107 కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, స్పెషల్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

తాజాగా మేకర్స్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు. ఎన్బీకే 107 నుంచి ఇప్పటి వరకు గట్టిగా కిక్ ఇచ్చే అన్సౌన్స్ మెంట్ రాలేదని నిరాశలో ఉన్న అభిమానులకు పండుగ చేసుకునే అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే బాలయ్య పుట్టిన రోజు ఉన్న సందర్భంగా ఎన్బీకే107 నుంచి మాసివ్ అప్డేట్ రానున్నట్టు తెలిపారు. బాలయ్య ఫస్ట్ హంట్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ చిత్ర టైటిల్ పైనా ప్రస్తుతం క్రేజీ టాక్ వినిపిస్తోంది.‘అన్నగారు, జై బాలయ్య’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలస్తోంది. 

`NBK 107` వర్క్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్‌ మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మాస్ పోస్టర్ రిలీజ్ కావడం ఫ్యాన్స్ లో జోష్ పెంచుతోంది. త్వరలో ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Scroll to load tweet…