కమర్షియల్ సినిమాలు చేసినంతకాలం సినిమా ఈవెంట్లలో పాల్గొని,  కొన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేసి తనవంతు ప్రమోషన్స్ చేసేసి ఊరుకునేది. కానీ తన రేంజ్ బాగా పెరిగిన తరువాత ఇప్పుడు సోలోగా తన సత్తా చాటాలని చూస్తోంది.

ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఓ బేబీ' సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అమ్మడు  మాములుగా ప్రచారాలు చేయడం లేదు. తన వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపిస్తుంది.

సినిమా పోస్టర్లు రాగానే.. 'మీరు కూడా వింటేజ్ బట్టల్లో దిగిన ఫోటోలు ఉంటే షేర్ చేయండి' అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఆ తరువాత రిలీజైన ట్రైలర్లు, టీజర్లను సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేలా చూసుకుంది. దాదాపు అన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ, మధ్యలో షాప్ ఓపెనింగ్స్ కార్యక్రమాలకు వెళుతూ తన సినిమా చూడాలని తెగ ప్రమోట్ చేస్తోంది.

కొన్ని కాలేజీలకు కూడా వెళ్లి తన సినిమా గురించి చెప్పింది. ఇక టిక్ టాక్ యాప్ లో 'ఓ బేబీ' సినిమా డైలాగులను డబ్ చేసిన వాళ్ల వీడియోలు సేకరించి, వాటిని కూడా తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేస్తోంది. ఇదంతా చూస్తుంటే సమంత తన సినిమా ప్రమోట్ చేసే ఏ ఒక్క అంశాన్ని విడిచిపెడుతున్నట్లుగా లేదనిపిస్తుంది. మరి ఇవన్నీ కలిసొచ్చి సమంత హిట్ అందుకుంటుందేమో చూడాలి!