తాజాగా టీవీ సీరియల్ షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హిందీలో బాగా పాపులర్ అయిన 'ఘమ్ హై కిసీకి ప్యార్ మే' అనే టివి సీరియల్ షూటింగ్ లో భాగంగా ఈ ప్రమాదం జరిగింది.
చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నిర్మాతలు ప్రమాదాలు జరగకుండా వీలైనంత వరకు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా టీవీ సీరియల్ షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హిందీలో బాగా పాపులర్ అయిన 'ఘమ్ హై కిసీకి ప్యార్ మే' అనే టివి సీరియల్ షూటింగ్ లో భాగంగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ సీరియల్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని గోరేగావ్ ఫిలిం సిటీలో జరుగుతోంది. సరిగ్గా ఈ సాయంత్రం 4.30 గంటలకు పెద్ద అగిప్రమాదం సంభవించింది. సీరియల్ యూనిట్, నిర్మాతల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
షూటింగ్ లో భాగంగా ఓ బ్లాసింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కాగా ప్రమాదవశాత్తూ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గాలి ఎక్కువగా ఉండడంతో మంటలు మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశంలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవ శాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఎవరికైనా గాయాలు అయ్యాయా అనే తెలియాల్సి ఉంది.
ముంబై ఫిలిం సిటీ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు 'ఘమ్ హై కిసీకి ప్యార్ మే' యూనిట్ తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో 2000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫైర్ కి సంబందించిన సన్నివేశం చిత్రీకరిస్తునప్పుడు సీరియల్ యూనిట్, నిర్మాతలు కనీస జాగ్రత్తలు పాటించలేదని అంటున్నారు.
చిన్న తేడా జరిగినా ఎంతో మంది మంటలకు ఎఫెక్ట్ అయ్యే వారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీనితో మంటలు అదుపు చేసేందుకు ఏకంగా 8 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గాలి ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర షూటింగ్ సెట్స్ కి కూడా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామల్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలిం సిటీ డైరెక్టర్ పై, 'ఘమ్ హై కిసీకి ప్యార్ మే' టివి సీరియల్ నిర్మాతలపై ఎఫ్ఐ ఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి వస్తున్న మంటల విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. ఈ టివి సీరియల్ లో నీల్ భట్, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
