`ఫలక్‌నూమాదాస్‌` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌. అన్ని తానై రూపొందించిన ఈ సినిమా సక్సెస్‌ సాధించడంతో క్రేజీ హీరోగా మారాడు. ఆ తర్వాత `హిట్‌` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకున్నారు. ఇప్పుడు `పాగల్‌` మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. 

ఇదిలా ఉంటే మరో సినిమాని స్టార్ట్ చేశాడు విశ్వక్‌సేన్‌. `అశోకవనంలో అర్జున కళ్యాణం` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో ఆయన అర్జున్‌గా కనిపించబోతున్నారు.ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్‌ పతాకంపై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పకులుగా ఉండగా, బాపినీడు, సుధీర్‌ నిర్మిస్తున్నారు. దీనికి విద్యా సాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు మాస్‌ సినిమాలతో వచ్చిన విశ్వక్‌ సేన్‌ ఫస్ట్ టైమ్‌ క్లాసీ టైటిల్‌తో రాబోతుండటం విశేషం. ఈ చిత్రం ఆయనకి ఏడవది కావడం మరో విశేషం.