చిరంజీవి నటిస్తున్న ‘మెగా154’ (Mega 154) నుంచి దీపావళి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ అందింది. మాస్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ టైటిల్ టీజర్ విడుదలపై మేకర్స్ అప్డేట్ అందించారు. గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి (Chirnjeevi) నటిస్తున్న ‘మెగా154’ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతూనే ఉంది. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పించింది. ఎప్పటి నుంచో చిత్ర టైటిల్ కోసం అభిమానులు, ఆడియెన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అనఫిషీయల్ గా టైటిల్ ను ‘వాల్తేరు వీరయ్య’ (Valtheru Veeraiah)గా ప్రకటించారు. అయితే మాటల్లో చెప్పడమే గానా అధికారికంగా ప్రకటించలేదు. మెస్ట్ అవైటెడ్ టైటిళ్లలో ‘మెగా 154’కూడా ఒకటిగా నిలవడం విశేషం.
ఎట్టకేళలకు టైటిల్ రిలీజ్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు. తాజాగా అందించిన అప్డేట్ ప్రకారం.. ‘దీపావళి సందర్భంగా ‘మెగా 154’ టైటిల్ టీజర్ ను విడుదల చేస్తున్నాం. మాస్ ఎక్స్ ప్లోజన్ తోనే దీపావళి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 24న (రేపు) ఉదయం 11 : 07 నిమిషాలకు అప్డేట్ వస్తుంది. ఈ సందర్భంగా మాస్ మూలవిరాట్ కు స్వాగతం పలుకుదాం.’ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే, మాస్ అప్డేట్ ను అందిస్తూనే మేకర్స్ ‘మెగా 154’ నుంచి మాస్ గ్లింప్స్ ను వదిలారు. ఇందులో బీడీ ముక్కను మాస్ స్టైల్ లో కాల్చుతూ అదరగొట్టాడు. చెవికి పొగు, చేతికి కడెం, ఉంగరాలు, మెడలో చైన్ వేసుకొని మొత్తానికి మాస్ లుక్ ను ప్రజెంట్ చేశారు. బ్యాక్ నుంచే బాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంటే.. ఇక టీజర్ లో దుమ్ములేచిపోతుందని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
చిత్రంలో మెగాస్టార్ ను బాబీ వింటేజ్ లుక్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన చిరు లుక్స్ కూడా అదే సూచిస్తున్నాయి. మాస్ యాంగిల్లో అన్నయ్య కుమ్మేసాడని అంటున్నారు. మూవీలో చిరు సరసన గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడింది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
