అప్పటికే అందాల రాముడు సినిమాతో హీరో అయిన సునీల్ ని నిలబెట్టిన  సినిమా  'మర్యాదరామన్న'. దాదాపు పదేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా తన మర్యాదైన కథనంతో అందరి మన్ననలూ పొంది ఇప్పటికీ గుర్తిండిపోయింది. అయితే అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. మర్యాదరామన్న తర్వాత సునీల్ కు సరైన హిట్ ఇప్పటికీ పడలేదు. అందులో హీరోయిన్ గా చేసిన సలోని అయితే జనాలకు అసలు గుర్తే లేదు. కానీ వీళ్లిద్దరినీ మళ్లీ కలిపితే ఓ క్రేజీ కాంబినేషన్ కాకపోవచ్చు కానీ ఓ మ్యాజిక్ జరుగుతుందని భావించారు వియన్ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఈ కాంబినేషన్ మళ్లీ తెరకెక్కుతోందని సినీ వర్గాల సమాచారం.
 
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఇప్పటిదాకా ఈ చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఆయితే రాలేదు. వియన్ ఆదిత్య కు మంచి టాలెంట్ ఉన్నా వెనకబడి పోయారు. ఆయన కూడా ఈ సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాసం ఉంది. సునీల్ ని కొత్త తరహాలో ప్రెజెంట్ చేసే ఈ చిత్రం కథ ఫ్యామిలీలకు నచ్చేలా ఫన్ తో రూపొందుతోందని వినికిడి. ఇక ఈ సినిమాని ఓటీటిలో రిలీజ్ చేస్తారా లేక థియోటర్ లో వదులుతారా అనేది తేలాల్సి ఉంది. 
 
హాస్య నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హీరో స్థాయికి ఎదిగారు సునీల్‌. అయితే, గత కొంతకాలంగా ఆయన చిత్రాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో పలు చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు. ‘డిస్కోరాజా’లో అయితే ఏకంగా విలన్ పాత్రను విభిన్న మేనరిజమ్‌తో చేసి ఆకట్టుకున్నారు. రీసెంట్ గా కలర్ ఫొటో చిత్రంలోనూ ఆయన తన విభిన్న తరహా నటనతో విలన్ గా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కీలక పాత్రలో మరో చిత్రం తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ సినిమాకు కథ అందించారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.