Asianet News TeluguAsianet News Telugu

కాలనీలో లవ్ స్టోరీ.. మారుతి కొత్త సినిమా మొదలైంది

 రీసెంట్ గా ‘కాల‌నీలో ప్రేమాయ‌ణం’ టైటిల్ తో ఓ కొత్త చిత్రం మొదలెట్టారు. అదేంటి ఆల్రెడీ గోపిచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు కదా. మళ్లీ కొత్త సినిమా అంటారేంటి అంటారా..అదే కదా మారుతి గొప్పతనం.
 

Maruthis quickie with Santosh Shobhan jsp
Author
Hyderabad, First Published Jun 9, 2021, 1:30 PM IST

లాక్ డౌన్ ఎత్తకముందే కొందరు ఫిల్మ్ మేకర్స్ షూటింగ్ లు మొదలెట్టేసారు. కరోనాకు సంభందించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటివారిలో దర్శకుడు మారుతి ఒకరు. ఆయన రీసెంట్ గా కాల‌నీలో జరిగే ఓ లవ్ స్టోరీ పాయింట్  తో ఓ కొత్త చిత్రం మొదలెట్టారు. అదేంటి ఆల్రెడీ గోపిచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు కదా. మళ్లీ కొత్త సినిమా అంటారేంటి అంటారా..అదే కదా మారుతి గొప్పతనం.

 కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ..గోపీచంద్ తో చేస్తున్న`ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` ఆగింది. ఖాళీగా ఉండటం ఎందుకు అనుకున్నాడేమో ఈగ్యాప్ లో మారుతి మ‌రో సినిమాని పట్టాలు ఎక్కించేసాడు. అయితే ఈ సారి ఓటీటీ కోసం తీస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ రీసెంట్ గా `ఏక్ మినీ క‌థ‌` రూపొందించి, ఓటీటీలో విడుద‌ల చేసింది. ఈ సినిమాకు మంచి పేరు,క్రేజ్ వచ్చింది. అడల్డ్ కంటెంట్ తో తయారైన ఈ సినిమాతో యూవీకి మంచి లాభాలొచ్చాయి. ఆ ఊపులో మ‌రో ప్రాజెక్టుని మొదలెట్టింది యూవీ. ఇందులో సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.

అందుతున్న సమాచారం మేరకు  ఓ కాల‌నీలో జ‌రిగే ప్రేమ‌క‌థ ఇది. రెండు ఇళ్ల మ‌ధ్య న‌డిచే రొమాంటిక్ డ్రామా. హీరోయిన్ గా మెహ‌రీన్ క‌నిపించ‌బోతోంది. అయితే ఈ సినిమాకి మారుతి డైరక్టర్ కాదు. కేవ‌లం ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ మాత్ర‌మే. అప్పట్లో `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌` కి మారుతి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసారు.  ఆ తర్వాత అలా చేస్తున్న సినిమా ఇదే. జులైలో.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈలోగా… ఈ ల‌వ్ స్టోరీని ఫినిష్  చేయాల‌ని చూస్తున్నాడు మారుతి. ఓ నెల‌లో… సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెట్టేస్తారన్నమాట. తక్కువ బడ్జెట్ లో సాగే కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమా ఇది. అందుకే ఇప్పుడు అందరూ దటీజ్ మారుతి..మిగతా డైరక్టర్స్ ఆయన రూట్ లో వెళ్లటం బెస్ట్ అంటున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios