‘మార్క్ ఆంటోనీ’ తెలుగులో ఒక రిజల్ట్..తమిళంలో మరో రిజల్ట్
చూసిన సీక్వెన్సే మళ్లీ మళ్లీ కనిపిస్తుండటం రిపీట్‌నెస్ మరీ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఆంటోనిని చంపేందుకు జాకీ చేసే ప్రయత్నాల్ని మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది.

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ ఈ శుక్రవారం రిలీజైంది. విభిన్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. అందరి దృష్టి దీనిపై పడింది. ఈ టైమ్ ట్రావెల్ సినిమా తమిళ,తెలుగులో ఒకే రోజు రిలీజైంది. కానీ వేర్వేరు రిజల్ట్ లు ఇచ్చింది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. దాంతో అక్కడ కలక్షన్స్ బాగున్నాయి. ఈ వీకెండ్ కే అక్కడ బ్రేక్ ఈవెన్ వస్తుందంటున్నారు. తెలుగులో మాత్రం ఆ స్దాయి బజ్ రాలేదు. ఇక్కడ వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు. తమిళంలో విశాల్‌ను హిట్ ట్రాక్ ఎక్కించగలిగింది కానీ తెలుగులో పెద్దగా కలిసి రాలేదు.
ముఖ్యంగా కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవటంతో విశాల్ చాలా హ్యాపీగా ఉన్నారు . తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఫస్టాప్ నడిచిపోయినా, సెకండాఫ్ లో టైమ్ ట్రావెల్ కథ కాస్తా టైమ్ లూప్ కాన్సెప్ట్ తరహాలో మరీ రిపీటెడ్‌గా సాగడం ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈ కథలోని పాత్రలు.. దీని కోసం సృష్టించిన ప్రపంచం.. ఇందులో ఉన్న కాంప్లిక్ట్స్ , ఫన్ బాగానే ఉన్నా తమిళ ప్లేవర్ ఎక్కవ ఉండటంతో ఇబ్బంది పెడుతుంది.
చూసిన సీక్వెన్సే మళ్లీ మళ్లీ కనిపిస్తుండటం రిపీట్‌నెస్ మరీ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఆంటోనిని చంపేందుకు జాకీ చేసే ప్రయత్నాల్ని మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈసినిమాలో ఎస్ జె సూర్య నటన హైలైట్ అయ్యింది.డైలాగ్స్ ,యాక్టింగ్ తో అదరగొట్టాడు. అంతేకాదు సిల్క్ స్మిత రిఫరెన్స్ సీన్ తమిళ థియేటర్లలో బాగా పేలింది.ఇక గత కొంత కాలంగా హిట్ కొట్టలేకపోయిన విశాల్ ఈ మార్క్ అంటోనీ సక్సెస్ తో ఎట్టకేలకు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
మార్క్.. ఆంటోని పాత్రల్లో విశాల్ వైవిధ్యమైన నటన కనబర్చారనే చెప్పాలి. ముఖ్యంగా ఆంటోని పాత్రను తీర్చిదిద్దిన తీరు.. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్‌లో సరికొత్త గెటప్‌తో సర్‌ప్రైజ్ చేశారు. జాకీగా.. ఆయన తనయుడు మార్తాండ్‌గా ఎస్.జె.సూర్య కూడా రెండు పాత్రల్లో సందడి చేశారు. అద్విక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టాలీవుడ్ యాక్టర్స్ సునీల్,రీతూ వర్మ కీలక పాత్రల్లో నటించారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఎస్ వినోద్ కుమార్ నిర్మించాడు.