తమన్నా చెయ్యిని కాళ్ల మధ్య ఉంచి, కావాలా? రా! అందంటూ విమర్శలు
కావాలా? అనే ఓ పాటలో.. చాలా దారుణంగా తమన్నా చెయ్యిని కాళ్లలో మధ్య ఉంచుతూ డ్యాన్స్ చేస్తుంది. కావాలా? రా! అని చూపించారు. ఆ విధంగా నేను సెక్సీగా తీయలేదు కదా..

`జైలర్`.. సినిమా లో తమన్నా చేసిన `నువ్వు కావాలయ్యా ` సాంగ్ పెద్ద హిట్ . థియేటర్లలో, సోషల్ మీడియాలో ఈ సినిమాకు ఓ రేంజి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట తమిళ వర్షన్‌కు 75 మిలియన్స్ (ఏడున్నర కోట్లు), తెలుగు వీడియో సాంగ్‌కు 20 మిలియన్స్ (రెండు కోట్లు) వ్యూస్ రావటమే అందుకు సాక్ష్యం. ఇన్ని కోట్లల్లో వ్యూస్ వచ్చాయంటే ఆ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్టయిందో తెలుస్తోంది. అయితే ఈ పాటపై మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చాడు. ఆ పాటలో తమన్నా మూమెంట్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఆయన కూడా తమన్నా సాంగ్‌పై అసభ్యంగా మాట్లాడారు. అలాంటి పాటకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.
మన్సుర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ కావాలా? అనే ఓ పాటలో.. చాలా దారుణంగా తమన్నా చెయ్యిని కాళ్లలో మధ్య ఉంచుతూ డ్యాన్స్ చేస్తుంది. కావాలా? రా! అని చూపించారు. ఆ విధంగా నేను సెక్సీగా తీయలేదు కదా.. వాళ్లు అడగటం లేదు. అడగరు. అది చాలా దారుణమైన మూమెంట్’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు అంతటా వైరల్‌గా మారింది.
అయితే మన్సుర్ సెన్సార్ బోర్డుపై.. తమన్నా ‘కావాలయ్యా!’ పాటపై విమర్శలు చేయడానికి ఓ కారణం ఉంది. ఆయన తీసిన ‘ సరకు’ అనే సినిమాలోని చాలా సీన్స్ కు సెన్సార్ బోర్డు కట్స్ పెట్టింది. చాలా సీన్స్ ని మార్చాలని కూడా ఆదేశించింది. ‘కావాలయ్యా!’ సాంగ్ ఈ సంవత్సరంలో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ పాటను సింగర్ శిల్పారావ్ పాడగా.. తమన్నా డ్యాన్స్ చేశారు. తమిళ రచయిత అరుణ్ రాజా కామరాజ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు.