Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి ప్రేక్షకాధారణతో దూసుకెళ్తుంది. ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అందర్నీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నీరజ్ సార్ ని అలా చూస్తే చాలా సంతోషంగా అనిపించింది, మీరు కోరుకున్న మార్పు కనిపించింది అంటుంది అను. నేను కోరుకున్న మార్పు నీరజ్ లో కాదు మాన్సీ లో తనలో మార్పు వస్తేనే వర్ధన్ కుటుంబంలో ఆనందం వస్తుంది అంటాడు ఆర్య. ఆ మార్పు వస్తుందా అని అను అంటే ఎదురు చూద్దాము ఖచ్చితంగా వస్తుంది అంటాడు ఆర్య. ఆరోజు తొందరలోనే రావాలని ఆశిద్దాం అంటుది అను.

మరోవైపు ఆర్య సార్ కోరుకున్నట్లుగానే నిరజ్ సర్ లో మార్పు వచ్చింది డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు. మాన్సీ మేడం మాట అసలు వినట్లేదు అని ఆర్య తల్లికి చెప్తాడు కేశవ. మంచిదే కదా లేకపోతే మాన్సి ఆడిందే ఆట పాడిందే పాట అయిపోతుంది అంటుంది ఆర్య తల్లి. అంతలోనే ఆనందంగా పరిగెత్తుకు వచ్చిన నీరజ్ నేను దాదాని చూశాను అని చెప్తాడు. ఎక్కడ చూసావు అని ఆర్య తల్లి అడిగితే అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో టై అప్ అయ్యానని చెప్పాను కదా అక్కడ తను పార్టీకి ఇన్వైట్ చేసింది అంటూ చాలా ఆనందంగా జరిగిందంతా చెప్తాడు నీరజ్.

మాన్సీ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఆర్య ఎలా ఉన్నాడు అని అతని తల్లి అడిగితే తనకేమీ తను ఎక్కడ ఉన్నా తనకి ఓన్ ఐడెంటిటీ ఉంటుంది. మనం టైయప్ అయిన కంపెనీకి దాదానే హెడ్ గా ఉండి లీడ్ చేస్తున్నాడు అంటాడు. దాదా ఇంటికి మాత్రమే దూరంగా ఉన్నాడు. అంతేగాని వర్ధన్ కుటుంబ బాధ్యతలకు ఎప్పుడు దూరంగా లేడు. ఒకప్పుడు మన ముందు ఉండి కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు వెనక ఉండి విజయం వైపు నడిపిస్తున్నాడు దాదా ఇప్పుడు మనతోనే ఉన్నాడు అంటాడు నీరజ్.

మీరన్నది నిజమే ఆర్య ప్రేమ తన మనసు లాగే చాలా విశాలమైనది. ఎక్కడికి వెళ్లినా అది మనతోనే ఉంటుంది అంటాడు కేశవ. నన్ను వెంటనే తన దగ్గరికి తీసుకొని వెళ్ళు.. నాకు చూడాలని ఉంది అంటుంది ఆర్య తల్లి. దాదా కోరుకునే మార్పు పూర్తిగా వచ్చేవరకు తను ఇంటికి రాడు. అది దాదా తనకు తానుగా విధించుకున్న నిబంధన. మనం ప్రయత్నించిన లాభం ఉండదు అంటాడు నీరజ్. బాధతో కూర్చుండిపోతుంది అతని తల్లి.

బాధపడొద్దు.. దాదా కోరుకునే మార్పు త్వరలోనే వస్తుంది అంటూ తల్లిని ఓదార్చుతాడు నీరజ్. ఆమె సరే అనటంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నీరజ్. మాన్సిని పిలిచి అను ఎలా ఉంది తనతో నువ్వు మాట్లాడావా అని అడుగుతుంది ఆర్య తల్లి. లక్షణంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నా బ్రోయిన్లా తనకి ఏమి కానివ్వండి కదా మామిన్లా మీరేమీ ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటుంది. నువ్వు తనని రమ్మని పిలవలేదా అంటే నేను వాళ్ళని పొమ్మనలేదు కదా రమ్మనటానికి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

నాకెందుకో ఆర్య వాళ్ళు మన ఇంటికి వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది అని కేశవ తో చెప్తుంది ఆర్య తల్లి. మీరన్నది నిజమే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నీరజ్ సార్ చెప్పినట్లు అప్పటివరకు మనం వెయిట్ చేయడమే మంచిది అంటాడు కేశవ. ఆ మాటలు విన్న మాన్సి కోపంతో రగిలిపోతుంది. అసలు వాళ్ళని ఈ ఊరి నుంచే తరిమిద్దాం అనుకుంటుంటే.. మీరు ఇంటికి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారా మీ ప్లాన్స్ మీకు ఉంటే నా ప్లాన్స్ నాకు ఉన్నాయి అంటూ అంజలి కంపెనీలో తను అపాయింట్ చేసిన వ్యక్తికి ఫోన్ చేస్తుంది. ఇక్కడ పనులు జోరుగా సాగుతున్నాయి ఎక్స్ట్రా సైట్ ఇంజినీర్స్ ని కూడా పెట్టారు అంటుంది ఆమె.

ఆ ప్రాజెక్టు సక్సెస్ అవ్వకూడదు. అందుకే నిన్ను అక్కడ అపాయింట్ చేశాను అంటుంది మాన్సీ. ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తూ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యేలాగా వాళ్లకి తెలియకుండా గోతులు తీస్తాను అంటుంది ఆమె. నువ్వు నా మనిషివి అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మాన్సి. ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసి తిరిగి ఈ ఇంట్లో తిష్ట వేసి ప్లాన్లో ఉన్నావా నీతో ఛాలెంజ్ చేసినట్లే పదంటే పది రోజుల్లో మీ కలలని కూల్చి వేస్తాను అనుకుంటుంది మాన్సీ.

మరోవైపు బాత్రూం కి వచ్చిన అను అక్కడ ఆర్య చేస్తున్న సెట్టింగ్లు చూసి ఆశ్చర్య పోతుంది. ఏంటి సర్ ఇదంతా అని అడుగుతుంది. ఒక నిమిషం ఆగు అని పళ్ళెంతో షవర్ తయారు చేస్తాడు ఆర్య. షవర అని అను అడిగితే అవును బకెట్ తో నీళ్లు తెచ్చుకొని స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నావు. అందుకే ఈ ఏర్పాటు చేశాను అంటాడు ఆర్య. నా ప్రతి అవసరం మీకు ఎలా తెలుస్తుంది అంటుంది అను. ప్రేమిస్తున్నాను కదా అంటాడు ఆర్య. ఇది ఎలా పని చేస్తుందో చెక్ చేస్తాను ఆర్య. అది బాగా పనిచేయడంతో ఇట్స్ వర్కింగ్ అంటే ఆనంద పడిపోతారు ఇద్దరు.

అంతలోనే ఆర్య వచ్చి ఏంటి డ్రీమ్ లో ఉన్నారా అంటూ గట్టిగా తడతాడు. ఊహల్లోంచి బయటికి వచ్చిన అనుని చూసి ఏం కలగన్నారు అంటాడు ఆర్య. మూవీస్ లో హీరోస్ హీరోయిన్ల కోసం పసిఫిక్ లో దూకేస్తాను ఎవరెస్ట్ ఎక్కేస్తాను అంటే అంతా బడాయి అనుకునేదాన్ని కానీ ప్రేమించిన వాళ్ల కోసం ఏదైనా చేయొచ్చు అని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది అంటూ ఐ లవ్ యు చెప్తుంది అను. మీ టు త్వరగా స్నానం చేసి రా నేను సాంబ్రాణి సిద్ధం చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. మరోవైపు భూమి పూజ దగ్గరికి వస్తుంది అంజలి. ఆమెని రిసీవ్ చేసుకుంటూ మీకోసమే వెయిట్ చేస్తున్నాను.

పూజ ప్రారంభించేస్తే పనులు ప్రారంభిద్దాం అంటాడు యాదగిరి. ఆనంద్ ఎక్కడ అని అడగడంతో షాక్ అవుతాడు యాదగిరి. పంచువాలిటీ లేనోళ్లు టైం కి పనికి ఏడ వస్తారు పంతులు గారిని పిలిస్తే పూజ షురూ చేద్దామంటాడు యాదగిరి. వెయిట్ చేద్దాం అంటుంది అంజలి. అంతలోనే అక్కడికి వచ్చిన మేనేజర్ ని పూజ 11:30 కి అయితే మీరు మీ గ్యాంగ్ లీడర్ 12 కి వస్తారా అంటుంది అంజలి. మేము ఎనిమిది గంటలకే వచ్చేసాం మేడం అక్కడ ఒక సెక్షన్ లో ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ సెక్షన్ లో స్టార్ట్ చేయడానికి ఆనంద్ గారు టీం తో డిస్కస్ చేస్తున్నారు అంటాడు మేనేజర్.

చూద్దాం పదండి అంటూ వెళ్తుంది అంజలి. పూజ చేయకుండా పండ్లు సూర్యుడు చేస్తున్న మీరు ఎంత అపశకునం అంటూ హడావిడి చేస్తాడు యాదగిరి. అంజలి కూడా ఫస్ట్ పూజ చేసి కదా వర్క్ స్టార్ట్ చేయాలి మీరేంటి ఇలా చేశారు అంటే ముహూర్తం 8.20 కి ఆ టైం కి పూజ జరిగింది అంటాడు ఆర్య. ఇప్పుడు టైం 11:30 ఈ టైంలోనే ఒక రోజులో జరగవలసిన పని అంతా అయింది. మ్యాన్ పవర్ ని మిషన్ పవర్ ని కరెక్ట్ గా వ్యూస్కోవాలి కానీ ఎంత పనైనా చేయొచ్చు అంటాడు ఆర్య. మేడం లేకుండానే పూజ చేస్తావా అంటాడు యాదగిరి. నేను అనుకున్న ముహూర్తానికి పూజ చేయిస్తాను మనకి అనుకూలమైన ముహూర్తానికి కాదు అంటాడు ఆర్య.

అంజలి, ఆర్య కి శాలరీ పెంచి యాదగిరికి శాలరీ తగ్గిస్తుంది. ఆర్య కి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోబోతు నువ్వు ఏం తింటావు నీ బ్రెయిన్ ఎంత షాపుగా పనిచేస్తుంది అంటుంది. కానీ ఆ మాటలు వినటానికి అక్కడ ఆర్య ఉండడు. గురూజీకి పొగడ్తలు అంటే పడదు అంటుంది అంజలి. ఇదే విషయాన్ని అంజలి పిఎ మాన్సికి ఫోన్ చేసి చెప్తుంది. మా బ్రో ఇలా ఎప్పుడు అంతే ఒకసారి బరిలోకి దిగితే అనుకున్నది సాధించక మానవుడు ఎలాగైనా ఈ పని ఆపాలి అంటూ ఆలోచనలో పడుతుంది. ఒక ఆలోచన వచ్చినట్లుగా సైట్లో పని చేస్తున్న వాళ్ళ డీటెయిల్స్ అన్ని నాకు పంపించు తర్వాత సంగతి నేను చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్స్తుంది మాన్సీ.

మరోవైపు ఒక అతనికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు నీకు అప్పజెప్పిన పని ఏం చేశావు అక్కడ వాళ్ళు పని స్టార్ట్ చేసేసారు తొందర్లోనే ఆ అంజలి తన కంపెనీకి ఎండిని చేసిన చేసేస్తుంది అప్పుడు ఆస్తి పోగొట్టుకొని నేను మీ మెడిసిన్ ఖర్చు కోసం నువ్వు ముస్టేత్తుకోవాలి అంటుంది. అంతవరకు రానివ్వను టైం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే అంటాడు అతను. మా బ్రో ఇన్ లా కి ఇక్కడే కాదు మరి ఎక్కడ పని లేకుండా చేయాలి అసలు ఈ ఊర్లోనే లేకుండా చేయాలి అని మాంసి అంటే అసలు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అంటాడు అతను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.