Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో  ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొడుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు మార్చి 3 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్య వర్ధన్ ధైర్యాన్ని తెగింపుని మీ మంచితనాన్ని పునికి పుచ్చుకున్న వారసుడ్ని కనాలని ఆశీర్వదిస్తున్నాను అంటాడు జెండే. మాన్సీ జి మీరు ఆశీర్వదించకపోయిన వచ్చి ఫోటో దిగొచ్చు దానికి ఏమీ సెంటిమెంట్లు ఉండవు కదా అంటాడు జెండే.ఒకసారి ఫెయిల్ అయిందని మళ్లీ చేస్తున్నారు ఇది కూడా ఫెయిల్ అయితే ఏం చేస్తారో చూస్తాను అనుకుంటూ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లి ఫోటో దిగుతుంది మాన్సీ.

ఎవరు చూడకుండా కాలితో దీపాన్ని తన్నేస్తుంది. ఫోటోలు హడావుడిలో ఎవరు గమనించరు. ఒక్కసారిగా మంటలు వ్యాపించుకుంటే అందరూ షాక్ అవుతారు. ఆర్య అనుని పక్కకు లాగేస్తాడు. ఏమీ కాలేదు ఎందుకు అందరూ రిలాక్స్ అవుతారు. భయపడకండి ఇలాంటి జరిగితే దిష్టి పోతుంది అంటారు అక్కడున్నవాళ్ళు. కార్యక్రమం పూర్తవుతుంది అంటే పద్దు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. మరోవైపు తెలుగు ప్రయాణమైన అంజలి అక్కడ నీరజ్ కారుని చూస్తుంది.

అదే విషయాన్ని యాదగిరి తో చెప్తే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు పదండి చూద్దాం అంటాడు. మరోవైపు భోజనాలు చేసే కార్యక్రమం అయిపోతుంది అంటాడు జనార్ధన్. అదేంటి వేరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం ఏమీ లేవా, అందుకు బడ్జెట్ ఏమీ ప్రొవైడ్ చేయలేదా నీరజ్ అంటుంది మాన్సీ. ఏం మాట్లాడుతున్నావు మాన్సీ అంటుంది శారదమ్మ.

ఇక్కడ ఫంక్షన్ జరగడం అనుకోకుండా అందరూ కలవడం ఇదంతా మీరజ్ ప్లాన్ అంటుంది మాన్సీ. ఆ మాటలకి అయోమయంలో ఉన్న అందరికీ జరిగిందంతా క్లియర్ గా చెప్తుంది మాన్సీ. సీమంతం చేయాలంటే డేరింగ్ గా డాషింగ్ గా అందరికీ తెలిసేలాగా చేయాలి ఇలాగా కన్నింగ్ ప్లాన్ తో కాదు. మీరు ఏమన్నారు కానీ బయటికి మాత్రమే వెళ్లారు.. ఎదుగుదలకు అడ్డుగానే ఉన్నారు. అంజలి ద్వారా ఆర్య వర్ధన్ ఇండస్ట్రీస్ కి దగ్గరవుతూనే ఉన్నారు మాటమీద నిలబడినప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఎందుకు సానుభూతి కోసమా అంటుంది మాన్సీ.

ఇంకొక మాట దాదా గురించి అవమానకరంగా మాట్లాడితే నా భార్యని కూడా మర్చిపోతాను. మాట తప్పింది దాదా కాదు, నీ మాటలు తలకెక్కించుకొని దారి తప్పింది నేను. దేవతల్ని ఇంట్లోంచి పంపించేసి దెయ్యంతో కాపురం చేస్తుంది నేను అంటాడు. ఇదంతా నేనే చేశాను ఎందుకంటే నావల్ల జరిగిన పొరపాటున సరిదిద్దుకోవాలని. పబ్లిక్ గా ఎందుకు చేయలేదని కదా అడిగావు నా దాదా ఒకసారి మాట ఇస్తే వెనక్కి తగ్గడు ఇలా ఫంక్షన్ చేస్తాను అంటే అసలు ఒప్పుకోడు కాబట్టి.

అంతేగాని తెలిస్తే నువ్వేదో పొడిచేస్తావని కాదు. ఇప్పుడు చెప్తున్నాను రాదా వదినమ్మ ఎక్కడికి వెళ్లారు ఆయన ఇంట్లోనే ఆయన స్థానంలోనే అదే అధికారంతో ఉంటారు అంటాడు. మరోవైపు ఆర్యతో మిమ్మల్ని మోసం చేయాలని కాదు మీకు చెప్తే ఒప్పుకోరు అని ఇలా చేశాను ఇంక దాగుడుమూతలు చాలు మీ ఇంటికి వచ్చేయండి అంటాడు ప్లీజ్. నేను అడిగింది ఎందుకు బయటకు వచ్చాను తిరిగి వెనక్కి ఎందుకు రానున్నానో ఇంతకు ముందే చెప్పాను. నన్ను మాట తప్పిన వాడిని చేయకు ఆర్య.

ఇలా ఇంటికి ఎంతకాలం దూరంగా ఉంటావు అంటుంది శారదమ్మ. మీరు అలా మాట్లాడకండి అంటుంది పద్దు. నీ కూతుర్ని బాగా చూసుకోమని చెప్పటం వరకే నీ హక్కు అంతకుమించి కలగజేసుకోవద్దు అని మందలిస్తాడు సుబ్బు. నీకు మాటిచ్చాను మాన్సీ. నీ భర్త ఎదుగుదలకి అడ్డు రానని మాటిచ్చాను. అలాగే అంజలి కన్స్ట్రక్షన్ ఎదుగుదలకి సహకరిస్తానని బాధ్యత తీసుకున్నాను.

కో ఇన్సిడెంట్ గా రెండు టై అప్ అవడం వల్ల నీకు నేను ఎదురుపడ్డాను అంతేతప్ప కావాలని కాదు ఇకపై నేను నీకు కనిపిస్తే అంజలి కన్స్ట్రక్షన్ ఎంప్లాయ్ ఆనంద్ గా కనిపిస్తాను అంతేగాని ఆర్య వర్ధన్ గా కాదు అంటాడు ఆర్య. అన్ని ఇక్కడే వదిలేసి నాతో రా బట్టలు కూడా తీసుకురావద్దు మనది కానిది ఏది మనకి వద్దు అని తీసుకొని వెళ్ళిపోతాడు ఆర్య. దంపతులిద్దరూ బట్టలు మార్చుకొని వస్తారు నా భార్యని నాతో తీసుకువెళ్తున్నాను మీరు అనుకున్నట్లుగానే జాగ్రత్తగా చూసుకుంటాను అని పద్దుకి మాటిస్తాడు ఆర్య.

 మీ క్షేమ సమాచారాలు తెలియజేయండి చాలు అంటాడు సుబ్బు. అత్తమ్మ వెళ్ళొస్తాను అని అను చెప్తే మీరు మళ్ళీ ఇంటికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తాను అంటుంది శారదమ్మ. ఆర్య దంపతులు బయటికి వెళ్లడం అంజలి వాళ్ళు లోపలికి రావటం ఒకేసారి జరుగుతుంది కానీ ఇద్దరు ఎదురుపడరు. ఆర్య తిరిగి వచ్చే రోజు తొందరలోనే వస్తుంది అని నీరజ్ కి ధైర్యం చెప్తాడు జెండే. అక్కడినుంచి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. అంతలోనే ప్రీతి ఫోన్ చేసి ఇక్కడ సైట్ ఇంజనీర్స్ అందరూ ఒప్పుకున్నారు అని చెప్తుంది. వాళ్లందర్నీ ఇక్కడికి తీసుకురా తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను.

ఈ ప్రాజెక్టుని ఫెయిల్ చేసి బ్రోయిల్ అని అంజలి ఇండస్ట్రీస్ నుంచి కూడా దూరం చేస్తాను అంటుంది మాన్సీ. ఆవేశంగా ఆమె దగ్గరికి వచ్చిన నీరజ్ ఎందుకు దాదా వదనం మళ్ళీ అలా బాధ పెట్టావు అంటాడు నేనేం చేశాను ఇదంతా నా దగ్గర ఎందుకు దాచావు అని మాత్రమే అడిగాను అంటుంది మాన్సీ. నీవల్లే దాదా వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు అంటూ ఆమె మీద కోప్పడతాడు నీరజ్. అప్పుడే అక్కడికి వచ్చిన అంజలి ఇక్కడ తెలిసిన వాళ్ళు పెళ్లి ఉంటే వచ్చాను మీరు ఏంటి ఇక్కడ అని అడుగుతుంది. తెలిసిన వాళ్ళ బేబీ షవర్ ఫంక్షన్ ఉంటే వచ్చాము అంటుంది మాన్సీ.

వర్క్ ఎలా జరుగుతుంది అని అడుగుతాడు నీరజ్ త్వరలోనే కంప్లీట్ చేద్దాం అంటాడు యాదగిరి. నేను కంప్లీట్ అవ్వనిస్తే కదా అనుకుంటుంది నీరజ. మరోవైపు సైట్ ఇంజనీర్స్ అందర్నీ కలిసిన మాన్సీ నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. అక్కడ అందరూ వర్క్ మానేయడానికి ఏమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది. అక్కడ అందరికీ 50 కే ఇస్తున్నారు మరి మీరో అంటాడు ఒక సైట్ ఇంజనీర్. అందరికీ లక్ష చొప్పున ఇస్తాను మీకు ఓకే కదా అంటుంది మాన్సి.

హర్ష వర్ధన్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేయటం చాలా అదృష్టం అందులోని డబల్ పేమెంట్ ఇస్తున్నారు ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు అంటారు అందరు. నేను అక్కడ మానేయమన్నాను కానీ ఇక్కడ జాయిన్ అవమని చెప్పలేదు. మీరంతా అక్కడ వర్క్ మానేసి రెండు నెలల వరకు ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్లండి. ఏ గోవాకు వెళ్లి చిల్లవండి నెల అయ్యేసరికి మీ సాలరీస్ మీ అకౌంట్లో పడిపోతాయి అంటుంది మాన్సీ. శాలరీ ఇచ్చి ఎంజాయ్ చేయమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అంటారు సైట్ ఇంజినీర్స్ అందరు.