ఈ రోజు అంటే ఆగస్టు 17వ తేదీ నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించారని వినికిడి. రీసెంట్ గా మహేష్ కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చాడు.


మహేష్,త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం చిత్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'బ్రో' #Bro:TheAvatar సినిమాకు పని చేసిన త్రివిక్రమ్ ఇప్పుడిప్పుడే మహేష్ బాబు సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో టీమ్ లో కొత్త మార్పులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ (PSVinod) ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇప్పుడు వినోద్ స్థానంలో కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస (ManojParamahamsa) ని తీసుకున్నట్టుగా తాజా సమాచారం. 

మనోజ్ పరమహంస పెద్ద సినిమాలకు పని చేసిన ఎక్సపీరియన్స్ వుంది. రీసెంట్ అతను ప్రభాస్ (Prabhas) నటించిన 'రాధే శ్యామ్' #RadheShyam కి పని చేసాడు, అలాగే విజయ్ నటించిన 'బీస్ట్' #Beast కి కూడా అతనే సినిమాటోగ్రఫర్ గా పని చేసాడు. అతను విజయ్, లోకేష్ కనకరాజ్ (LokeshKanagaraj) కాంబినేషన్ లో రాబోతున్న 'లియో' #Leoకి కూడా పని చేసాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (GautamVasudevMenon) దర్శకత్వంలో విక్రమ్ (ChiyanVikram) నటిస్తున్న 'ధ్రువ నచ్చతిరం' (Dhruva Natchathiram) సినిమాకి కూడా పరమహంసే సినిమాటోగ్రాఫర్ కావటం విశేషం. ఈ నేపధ్యంలో కెమెరా వర్క్ ఓ రేంజిలో ఉంటుందని ఎక్సపెక్ట్ చేయచ్చు. ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవాల్సి ఉంది. 

కొన్నాళ్లుపాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యిందని తెలుస్తోంది. ఈ రోజు అంటే ఆగస్టు 17వ తేదీ నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించారని వినికిడి. రీసెంట్ గా మహేష్ కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చాడు.ఇక ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సెట్ వేసారట. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో అభిమానులు ...మార్పు మంచిదే మహేష్..కుమ్మేయ్ అంటూ విషెష్ చెప్తున్నారు.

ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయనున్నారు.