మరికొన్ని సినిమాలు వాయిదా పడబోతున్నాయి. అయితే ఇది చిన్న చిత్రాలకు వరంగా మారింది. పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా ఓ రేంజ్ సినిమాల నుంచి, స్టార్ హీరోల చిత్రాల వరకు వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే `లవ్‌స్టోరీ`, `టక్ జగదీష్`, `విరాటపర్వం` చిత్రాలు వాయిదా పడ్డాయి. మరికొన్ని సినిమాలు వాయిదా పడబోతున్నాయి. అయితే ఇది చిన్న చిత్రాలకు వరంగా మారింది. పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా `ఆర్జీవీ దెయ్యం` ఈ వారంలో వస్తుండగా, తేజ సజ్జా నటించిన `ఇష్క్` సినిమా వచ్చే వారం రాబోతుంది.
`టక్ జగదీష్` సినిమా ఈ నెల 23న రానుండగా, వాయిదా పడింది. ఇప్పుడు అదే తేదీనికి మరో యంగ్ హీరో మనోజ్ నందన్ నటించిన సినిమా `కథానిక` విడుదలకు రెడీ అవుతుంది. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వంలో పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం `కథానిక`. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల అవుతుంది.
ఈ సందర్భంగా కథ, మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన జగదీష్ దుగన మాట్లాడుతూ, `కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనంతో ఊహకందని మలుపులతో మంచి నటి నటులతో నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. మా చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాము. అందరికి నచ్చే చిత్రమవుతుంది. డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ నిస్తుంది` అని తెలిపారు. నిర్మాత పద్మ లెంక చెబుతూ, ``కథానిక` చిత్రాన్ని ఎంతో ప్యాషన్ తో నిర్మించాము. డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఎక్కడ రాజీపడకుండా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం, కథ కథనం మా చిత్రం లో హైలైట్ గా నిలిచాయి. రెండు తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తున్నాం` అని తెలిపారు.
వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 30న, అలాగే మే నెలలో చిన్న సినిమాల హవా కొనసాగనుందని చెప్పొచ్చు. ఓ రకంగా ఈ చిత్రాలకు పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.
