మంచు మోహన్ బాబు ఈరోజు తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ ఓ బాలికను దత్తత తీసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

'నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాను. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు' చెప్పారు. ఆ అమ్మాయిని విద్యానికేతన్ స్కూల్ లో జాయిన్ చేసినట్లు, తన భాద్యతలన్నీ కూడా నేనే తీసుకుంటానని చెప్పాడు.

మంచి చదువు చెప్పిస్తానని, జాగ్రత్తగా చూసుకుంటానని వెల్లడించాడు. ఐఏఎస్ అధికారి అవ్వాలనేది ఆమె ఆశయమని, తను అనుకున్నది సాధించే వరకు సాయపడతానని  తెలిపారు.

మంచు మనోజ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇలానే అందరికీ స్పూర్తిగా నిలవాలని  కోరుకుంటున్నారు.