ప్రస్తుతం టాపిక్ అంతా బాలీవుడ్ లో సౌత్ సినిమాల సత్తా గురించి నడుస్తోంది. ఈ విషయంలో బాలీవుడ్ నుంచి కొంత మంది స్టార్స్ రివర్స్ గేర్ వేస్తుంటే.. మరికొంత మంది స్టార్స్ మాత్రం సౌత్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పెయి సౌత్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం టాపిక్ అంతా బాలీవుడ్ లో సౌత్ సినిమాల సత్తా గురించి నడుస్తోంది. ఈ విషయంలో బాలీవుడ్ నుంచి కొంత మంది స్టార్స్ రివర్స్ గేర్ వేస్తుంటే.. మరికొంత మంది స్టార్స్ మాత్రం సౌత్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పెయి సౌత్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
సౌత్ సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్ పెయి. ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలు ఇండియన్ బాక్సాపీస్ దగ్గర సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు బాహుబలి నుంచి కేజీఎఫ్ 2 వరకు సౌత్ సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ తో బాలీవుడ్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఒకప్పుడు మన సినిమాను చీప్ గా చూసిన వారు.. మన సినిమాల ప్రభంజనానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇపుడు ఇండియాలో ఎక్కడ చూసినా సౌత్ సినిమాల జపం చేస్తున్నారు.
ఒకప్పుడు ప్రాంతీయ సినిమాలంటే లెక్కచేయని హిందీ యాక్టర్లు సైతం ఇపుడు సౌత్ సినిమాలను ఆకానికెత్తేస్తున్నారు. కరణ్ జోహార్, కంగనా రనౌత్, రణ్ వీర్ సింగ్ తో పాటు అనిల్ కపూర్ లాంటి స్టార్స్ సౌత్ సినిమాను ప్రమోట్ చేస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, పుష్ప బీటౌన్ బాక్సాపీస్ వద్ద చేస్తున్న వసూళ్లు బాలీవుడ్‌ను షేక్ చేశాయని ఇప్పటికే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గట్టిగానే పొగిడేశాడు.
ఇక మరో బాలీవుడ్ స్టార్ సౌత్ సినిమా గురించి స్పందించారు. టాలెంటెడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి స్పందించాడు. సౌత్ సినిమా ప్రభావంతో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్ స్ట్రీమ్ ప్రోడ్యూసర్లకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. వారికి ఇపుడు సరైన సినిమా ఎక్కడ వెతకాలో తెలియడం లేదు. మెయిన్ స్ట్రీమ్ సినిమాను ఎలా తీయాలో నేర్చుకునేందుకు ఇదొక లెసన్ లాంటిదన్నారు మనోజ్.
ఇపుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారని చెప్పుకొచ్చాడు మనోజ్ బాజ్‌పేయి. సౌత్ మేకర్స్ నుంచి బాలీవుడ్ నేర్చుకోవల్సింది చాలా ఉంది అన్నారు. ఇలా సౌత్ సినిమా గురించి బాలీవుడ్ నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది.
