మన్మథుడు సినిమాను అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ సిద్ధమైంది. యూఎస్ లో ఎప్పుడు లేని విధంగా నాగ్ సినిమా మొదటి సారి 250కి పైగా లొకేషన్స్ లలో రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే సినిమా ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1 మిలియన్ డాలర్స్ ని ఈజీగా అందుకుంటుందని చెప్పవచ్చు. 

అలాగే సినిమాపై హాట్ బ్యూటీ రకుల్ ఆశలు గట్టిగానే పెట్టుకుంది. 2017లో నాగ చైతన్యతో నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత అమ్మడికి సరైన సక్సెస్ లేదు. దీంతో ఆశలన్నీ మన్మథుడు 2పైనే పెట్టుకుంది. సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో తప్పకుండా సినిమా హిట్టవుతుందని నమ్మకంగా ఉంది. 

ఇక కోలీవుడ్ లో కూడా అవకాశాలు రావాలంటే రకుల్ కి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. చివరగా సూర్యతో నటించిన NGK పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒక్క బాలీవుడ్ లోనే దే దే ప్యార్ సినిమాతో సక్సెస్ అందుకుంది. అయితే ఆ సినిమా నార్త్ లో అవకాశాలు వచ్చేలా క్రేజ్ తేలేకపోయింది. దీంతో నాగ్ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటోంది.