యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ను కొన్ని గంటల ముందు ప్రవాసులు వీక్షించారు. ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం.చిత్ర యూనిట్ చెప్పినట్లుగానే.. సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీ ఎపిసోడ్స్ తో కొనసాగుతుంది. దర్శకుడు రాహుల్ వీలైనంత వరకు ప్రేక్షకుడిని నవ్వించే ప్రయత్నం చేశాడనిపిస్తోంది. ప్రతి యాక్టర్ నుంచి మంచి నటనను రాబట్టుకునే ప్రయత్నం చేశాడు.

అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్ సినిమాలో క్లిక్కయ్యాయి.ఫ్యామిలీ కారణంగా లవ్ ఫెయిల్యూర్ అయిన నాగ్ ఆ తరువాత ప్లే బాయ్ గా మారి... మధ్య వయసులోకి వచ్చేస్తాడు. అనంతరం అతనికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నించడం.. నాగ్ రకుల్ తో కలిసి డ్రామా స్టార్ట్ చేయడం వంటి అంశాలు కథలో కీ పాయింట్స్. కామెడీ ఎలివేట్ అయ్యేలా డైరెక్టర్ స్క్రీన్ ప్లేను సెట్ చేసుకున్న విధానం చాలా బావుంది. సీనియర్ యాక్టర్ లక్ష్మీ కూడా తన పాత్రతో ఆకట్టుకున్నారు.

పోర్చుగల్ లో సాగే సీన్స్ తో పాటు క్లయిమ్యాక్స్ లో వెన్నెల కిషోర్ సరికొత్త కామెడీ టైమింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి సీన్స్ రిచ్ అండ్ స్టయిలిష్ గా అనిపిస్తాయి. ఇక నాగ్ స్టైల్, సమంత గెస్ట్ రోల్ కూడా సినిమాలో మరో హైలెట్ పాయింట్స్. పాటలు మాత్రం సినిమాలో పెద్దగా క్లిక్కవ్వలేదని టాక్ వస్తోంది. ఫైనల్ గా మన్మథుడు 2 తెరపై ప్లే బాయ్ గా నవ్విస్తాడాని చెబుతున్నారు. మరి ఫైనల్ గా లోకల్ ఆడియెన్స్ కి సినిమా ఎంతవరకు నచ్చుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..