మలయాళ ముద్దు గుమ్మ మంజూ వారియర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? అవుననే సమాధానం వినపడుతోంది. మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో భయమెరగని నటిగా పేరుగాంచిన మంజు.. ఇప్పుడు తన పవర్ ని రాజకీయాల్లో చూపించనున్నారనే ప్రచారం మొదలైంది.

17వ సినీ రంగంలోకి అడుగుపెట్టిన మంజూ.. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. 1998లో నటుడు దిలీప్ ని వివాహం చేసుకున్నారు. అప్పుడు నటనకు స్వస్తి పలికిన ఆమె.. 2015లో దిలీప్ తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చారు. కట్టుకున్న భర్త తోటి నటిని లైంగికంగా వేధించాడని తెలియగా.. భర్త అని కూడా చూడకుండా బాధితురాలికి అండగా నిలిచి పోరాటం చేసిన ఘటన మంజూది.

కాగా.. ఇప్పుడు మంజూ వారియర్ రాజకీయాలవైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఆమెతో కాంగ్రెస్ పార్ట నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కొందరు సినీ జనాన్ని పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే మంజూ ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినా పార్టీ కోసం ప్రచారం చేయాలని కోరుతున్నట్లు సమాచారం.