చంద్రబాబు భార్యగా మలయాళ హీరోయిన్!

First Published 14, Aug 2018, 4:27 PM IST
Manjima Mohan as Chandrababu Naidu's wife in NTR biopic
Highlights

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పాత్రల కోసం వివిధ భాషలకు చెందిన తారలను ఎంపిక చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తుండగా, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పాత్రలో మలయాళ నటి మంజిమా మోహన్ కనిపించబోతుంది. దాదాపు ఆమె ఎంపిక ఖాయమైనట్లు చెబుతున్నారు. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన మంజిమా మోహన్ ప్రస్తుతం 'క్వీన్' మలయాళం రీమేక్ లో నటిస్తోంది.

త్వరలోనే ఆమె ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు తీసుకురావడానికి క్రిష్ కాస్టింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

loader