మెలోడీ బ్రహ్మగా సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. జనరేషన్స్ కి తగ్గటుగా మ్యూజిక్ లో కూడా అప్డేట్ అవుతూ వస్తున్నారు. అయితే మణిశర్మ వర్క్ చేసిన సినిమాలు గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా ని;లుస్తున్నాయి. 

సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా అవకాశాలు బాగానే అందుకుంటున్నారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆయన చాలా వరకు నిర్మాతలను అర్ధం చేసుకొని రిజనబుల్ ఎమౌంట్ కి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న మణిశర్మ నేడు 54వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈ కంపోజర్ తన ఆశలన్నీ ఇస్మార్ట్ శంకర్ పైనే పెట్టుకున్నాడు. 

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ జులై 18న విడుదల కానుంది. గత ఏడాది మణిశర్మ సంగీతం అందించిన మల్టీస్టారర్ దేవ దాస్ నిరాశపరచడంతో స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ తగ్గాయి. ఇక పోకిరి రేంజ్ లో పూరి సక్సెస్ ఇస్తాడని ఇస్మార్ట్ శంకర్ కోసం కష్టపడ్డాడు. మరి ఈ మాస్ ఎంటర్టైనర్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.